హైదరాబాద్

ఉత్తమ కాలనీలకు నజరానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: పౌరసేవల నిర్వహణను మెరుగుపర్చటంతో పాటు అందులో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం పెంపొందించేందుకు జిహెచ్‌ఎంసి మరో సరికొత్త ప్రయత్నం చేయనుంది. జిహెచ్‌ఎంసి పరిధిలో స్వచ్ఛ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన కాలనీ సంక్షేమ సంఘాలకు ప్రత్యేక పురస్కారాలను అందజేస్తూ ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను 11 విభాగాలుగా నిర్థారించిన అంశాల్లో ఆయా కాలనీలో చేపట్టిన చర్యలను తెలుపుతూ ఈ నెల 31వ తేదీలోపు జిహెచ్‌ఎంసి వెబ్‌సెట్‌కు దరఖాస్తులు పంపుకోవచ్చునని అధికారులు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన ఈ అవార్డులను అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో సర్కిల్‌కు ఐదు ఉత్తమ కాలనీలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. ఇందుకు గాను 11 విభాగాలుగా ఎంపిక చేసిన అంశాలకు 200 మార్కులు నిర్ణయించారు. ఉత్తమ కాలనీలుగా ఎంపికయ్యేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు నిర్ణయించిన పలు అంశాల్లో ఆశించిన ఫలితాలు సాధించిన వాటికి అంశాన్ని బట్టి మార్కులను నిర్ణయించనున్నారు.
ఇందులో భాగంగా కాలనీల్లో చెత్తను వేరు చేసేందుకు సహకారం అందిస్తే 50 మార్కులు, అలాగే ఇళ్లలో లేదా కాలనీలో సేంద్రియ ఎరువుల తయారీకి కంపోస్టు పిట్‌లను ఏర్పాటు చేసుకునేందుకు చొరవ చూపుతున్నందుకు మరో 50 మార్కులు కేటాయించనున్నారు. అలాగే, జిహెచ్‌ఎంసి నిర్వహిస్తున్న పలు అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనే కాలనీ సంక్షేమ సంఘాలకు 20 మార్కులు కేటాయించనున్నారు. స్థానిక పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారిని సత్కరించినందుకు గాను 20 మార్కులు, అలాగే హరితహారం కార్యక్రమ నిర్వహణ తీరును బట్టి 10మార్కులు, చెత్తను తగలబెట్టకుండా నివారించే అంశానికి సంబంధించి 20 మార్కులు, బహిరంగ గార్బేజీ పాయింట్ల తొలగింపునకు 30 మార్కులు, వీధి కుక్కల దత్తత కార్యక్రమం ‘మా ఇంటి నేస్తం’కు 10 మార్కులు, అలాగే, యాభై మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి 20 మార్కులు, వినూత్న స్వచ్ఛ కార్యక్రమాలకు 20మార్కులు కేటాయిస్తూ ఉత్తమ కాలనీలను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎంపిక చేసే పద్ధతి
వివిధ 11 విభాగాలకు చెందిన అంశాలకు సంబంధించి కాలనీ సంక్షేమ సంఘాలు చేపట్టిన పనులను జిహెచ్‌ఎంసి అధికారులతో గానీ, కాలనీ సంక్షేమ సంఘాలతో ధ్రువీకరించకుండా థర్డ్ పార్టీతో తనిఖీ చేయించి ప్రతి సర్కిల్‌కు ఐదు కాలనీలను ఎంపిక చేయనున్నారు. ఈ రకంగా ఎంపికైన కాలనీలకు జూన్ 5వ తేదీన ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయాలని అధికారులు భావిస్తున్నారు.