హైదరాబాద్

జిఎస్‌టిని నిరసిస్తూ 30న హోటళ్ల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 28: ఆతిధ్య రంగంపై జిఎస్‌టి పన్నును నిరసిస్తూ ఈనెల 30న రాష్టవ్య్రాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లను బంద్ చేసి నిరసన తెలపనున్నట్టు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది.
ఆదివారం ఖైరతాబాద్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి జగదీశ్వర్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకువచ్చే ఉద్ధేశ్యంతో తీసుకువచ్చిన జిఎస్‌టి పన్నులో హోటళ్లపై భారీ స్థాయిలో పన్ను విధించడం సరికాదని అన్నారు.
దేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధికులకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక భూమిక వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై భారీ పన్నులు విధించడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేక అనేక మంది రోడ్డుపై నాణ్యతలేని ఆహారాన్ని తింటూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30 బంద్ పాటిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో అశోక్ రెడ్డి, కష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.