హైదరాబాద్

సర్వజనుల సంక్షేమానికి లక్ష మోదుకల మహాయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 28: ప్రముఖ సంస్కృతాచార్యులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణశాస్ర్తీ సర్వ జనుల సంక్షేమానికి లక్ష మోదుకల మహా యాగం నిర్వహించారు. అల్వాల్ ప్రాంతంలోని మరకత లక్ష్మీగణపతి దేవాలయం వద్ద ఈ యాగం ప్రారంభమైంది. 12 హోమ గుండాల్లో శనివారం లక్ష మోదుకలతో ప్రారంభించగా, రెండో రోజు ఆదివారం కూడా మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగింది.
రెండో రోజు యాగానికి హంపి పీఠాధిపతి విద్యారణ్యనంద భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుగ్రహ భాషణ చేశారు. సంస్కృత సోదరులు బ్రహ్మశ్రీ కొడవటిగంటి శ్రీనాథ శర్మ, మహదేవ్ శర్మ పురాణ ప్రవచనం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల నుంచి వచ్చిన 150 మంది రుత్విక్‌లు మహాయాగంలో పాల్గొన్నారు. మోత్కూరు రామశాస్ర్తీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేల మందికి అన్నదానం నిర్వహించారు. సేవే ప్రధాన లక్ష్యంగా తమ జీవనం కొనసాగుతుందని సత్యనారాయణ శాస్ర్తీ స్పష్టం చేశారు. మిగిలిన మహాయాగం మూడో రోజు సోమవారం విశేష ద్రవ్యాలతో పూర్ణాహుతి చేయడంతో యాగం పరిసమాప్తి అవుతుందని తెలిపారు.