హైదరాబాద్

గంబూసియా చేపలతో దోమలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 28: రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని దోమలు వ్యాప్తి చెందకుండా జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలను సిద్దవౌతుంది. దోమల వ్యాప్తిని నిరుదించేందుకు జిహెచ్ ఎంసి ఎంటమాలజీ విభాగం పలు విధాలుగా ప్రయత్నిస్తుండగా దీనికి తోడు నీరు నిలిచే ప్రాంతాల్లో గంబూసియా చేపలను పెంచనున్నారు. ఒక దోమ ద్వారా వెయ్యిగుడ్లు వస్తాయని, ఇలా అతి తక్కువ వ్యవధిలో మూడు కోట్లకుపైగా దోమలు వృద్ధిచెందుతాయని గణాంకాలు వెల్లడిస్తున్న నేపధ్యంలో దోమల నివారణపై యుద్ధం ప్రకటించింది యంత్రాంగం. మహానగర పరిధిలోని 165 చెరువులతో పాటు నీరు నిలిచే క్వారీలు, బావుల్లో గంబూసియా చేపలను పెంచే ప్రయత్నంలో జిహెచ్‌ఎంసి నిమగ్నం అయింది. పట్టణ ప్రాంతాల్లో దోమల నివారణ సవాలుగా మారుతున్న నేపధ్యంలో అధికారులు నిత్యం నివారణ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో యాంటి లార్వ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నీరు నిలిచే ప్రాంతాలతో పాటు జంతు వధలు జరిగే ప్రాంతాల్లో దోమలు వీపరీతంగా వృద్ధి చెందుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని నివారించేందుకు నగరంలో పలు చోట్ల ఆధునిక కబేళాలను ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రతకు తావులేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వీటన్నింటి నేపధ్యంలో గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా కేసులు తగ్గినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
నగరంలో దోమల వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు పూర్తిగా సహకరిస్తేనే దోమలను అరికట్టవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.