హైదరాబాద్

సమగ్రాభివృద్ధే మోదీ లక్ష్యం: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, మే 29: సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం కవాడిగూడ బండమైసమ్మ నగర్ కమ్యూనిటీ హాల్‌లోఏర్పాటుచేసిన సమావేశంలో పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికీ మోదీ కరపత్రాలను ఆవిష్కరించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 29 నుండి జూన్ 12 వరకు క్షేత్ర స్థాయిలో బిజెపి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావటానికి కార్యకర్తల కృషే కారణమని అన్నారు. ప్రతి పేదవానికి ప్రగతి ఫలాలు అందించాలనే స్ఫూర్తితో మోదీ చేపట్టిన 106 పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని, పేదల అభ్యున్నతికి 32వేల పోలింగ్‌బూత్‌లలో పదివేల మంది కార్యకర్తలు పనిచేయాలని కోరారు. మూడు రోజుల అమిత్‌షా పర్యటనతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రూపురేఖలు మారిపోయాయని, సర్వేల పేరుతో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలే తిప్పికొడతారని విమర్శించారు. కెసిఆర్ హామీలు ఇవ్వటమే కాని అవి అమలుకు నోచుకోలేదని, ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ స్ఫూర్తితో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని అన్నారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు, దిల్లీ నుండి గల్లీ వరకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని, పోలింగ్ బూత్‌లే కేంద్రంగా కార్యకలాపాలు జరగాలని సూచించారు.
బిజెపి నగర అధ్యక్షుడు, ఎంఎల్‌సి రాంచందర్ రావు మాట్లాడుతూ అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. అన్ని రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమని, కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బిజెపి నగర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, డాక్టర్ రాజేశ్వరరావు, రమేష్‌రాం, వెంకటేష్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.

పనిచేసే షోరూమే
టార్గెట్

సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 29: తాను పనిచేస్తున్న షో రూమ్‌నే టార్గెట్ చేసిన డెలివరీ బాయ్ మోసానికి పాల్పడి రూ. 1.64 లక్షల విలువచేసే సెల్‌ఫోన్లను కాజేశాడు. సెంట్రల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కుల్సుంపురకు చెందిన బాజీరావు హీరాలాల్ (29), పంజగుట్టలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో డెలివరీ బాయ్‌గా నాలుగు నెలల క్రితం చేరాడు. కాగా హీరాలాల్ వివో స్మార్ట్ ఫోన్లను కొండాపూర్‌లోని బ్రాంచ్‌కు చేరవేస్తుంటాడు. నాలుగు నెలల నుంచి హీరాలాల్ సుమారు 13 వివో స్మార్ట్ ఫోన్లు డెలివరీ చేయకుండా, అతని స్నేహితుల ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తూ యాజమాన్యాన్ని మోసగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు హీరాలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ. 1.64 లక్షల విలువ చేసే 13 వివో స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడు హీరాలాల్‌ను పంజగుట్ట పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి తెలిపారు.