హైదరాబాద్

‘నాట్య సరస్వతి’ నృత్యోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: నృత్యోత్సవం-2017 పేరుతో నాట్య సరస్వతి నృత్య శిక్షణాలయం బంజారాహిల్స్ లామాకాన్‌లో నృత్య సంబరాలు జరుపుకుంది. దిల్లీకి చెందిన పూనం, కేరళకు చెందిన లక్ష్మీశంకర్, డా.సురభి శారద కథక్ నృత్యాన్ని కనువిందుగా ప్రదర్శించారు. కార్యక్రమంలో నాట రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కృతి ‘మహాగణపతిం భజేహం..’ సాహిత్యానికి అనువైన మువ్వల సవ్వడితో డా.సురభి లక్ష్మీశారద నృత్యాభినయం చేశారు. ఈ కీర్తనలో ‘మహాకావ్య నాటకాభిప్రియం మూషిక వాహన మోదక ప్రియ..’ అనే సాహిత్యంలో మూషిక వాహనుడిని స్తుతిస్తూ ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కథక్ నృత్యశైలిలో తుమ్రి అంశాన్ని కృష్ణవందన చేయగా కార్యక్రమానికి నాట్యాచార్యులు పసుమర్తి శేషుబాబు, రాఘవరాజ్ భట్, మంగళాభట్, డిప్లమాటిక్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రాయబారి డా. శ్రీనివాస్ ఏలూరి, డా. సరస్వతి పాల్గొని కళాకారులను అభినందించారు.

వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా మహేష్ గుప్త
చిక్కడపల్లి, జూన్ 4: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షునిగా డాక్టర్ మహేష్ గుప్త నియమితులయ్యారు. ముషీరాబాద్‌లో ఏర్పాటుచేసిన అభినందన సభలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సన్మానించి అభినందనలు తెలిపారు. వైశ్యుల సేవలు అద్భుతమని, దేశంలో సంపద సృష్టించటంలో వైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రాజ్యాధికారంలో కూడా ప్రభుత్వం వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తోందని అన్నారు. కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, మహిళా అధ్యక్షురాలు ఎం.మేఘమాల, పోలీసు హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్, హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లెం సంపత్ కుమార్ పాల్గొన్నారు.

నరేష్, స్వాతి హత్య కేసును..
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
కాచిగూడ, జూన్ 4: నరేష్, స్వాతి హత్య కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సామాజిక, ప్రజా సంఘాల నిజనిర్దారణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నరేష్, స్వాతి కులదురహంకార హత్యలను ఖండిస్తూ రాష్ట్ర సదస్సు ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు తమ్మినేని వీరభద్రం, జాజుల శ్రీనివాస్, ఆశాలత, ఝాన్సీ, సుధాభాస్కర్, బత్తుల రాంప్రసాద్, మేకపోతుల నరేందర్‌గౌడ్, అశయ్య, సుబ్బారాయుడు పాల్గొన్నారు. నరేష్, స్వాతి హత్యలో పోలీసులే ప్రత్యక్షంగా వ్యవహరించారని విమర్శించారు. కుల నిర్మూలన జరగలంటే కులంతర వివాహలు జరగలని అన్నారు. తెలంగాణలో వరుస సంఘటనల నేపథ్యంలో కొత్త ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైన ఉందని స్పష్టం చేశారు.
స్వాతి, నరేష్ హత్యలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి నరేష్ బంధువులను, తల్లిదండ్రులను బెదింరించిన ఆత్మకూరు ఎస్‌ఐ రామన్న, భువనగిరి సిఐను వెంటనే సస్పెండ్ చేసి వారిపై కేసులను నమోదు చేయాలని అన్నారు. నరేష్ ఎముకలను వెంటనే స్వాధీనం చేసుకొని ఫొర్సెనిక్ లాబ్ పరిక్షలకు పంపి నిజానిర్దారణ చేయించాలని తెలిపారు. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతనికి సహకరించిన మూఠా సభ్యులను చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. తెలంగాణలో మారోసారి కులదురహంకార హత్యలు జరుగుకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కులదురహంకార హత్యలను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ఉద్యమం తీసుకొస్తామని హెచ్చరించారు. రాబోవు రోజుల్లో ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు నాంది పలకాలని పిలుపునిచ్చారు.