హైదరాబాద్

రోడ్డు మరమ్మతులపై సమష్టి తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: వర్షాకాలం సమీపించటంతో రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టిన జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులు మంగళవారం నగరంలో సమష్టిగా తనిఖీలు నిర్వహించారు. ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఆటోనగర్, హుడా, సాయినగర్, గురుద్వారా, హుడాకాలనీ, ఎన్జీవో కాలనీ, సచివాలయనగర్, వైదేహినగర్, బిఎన్‌రెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్ పర్యటించారు. శివార్ల దాహర్తిని తీర్చేందుకు హడ్కో ప్రాజెక్టు కింద చేపట్టిన పైప్‌లైన్ విస్తరణ పనుల నిమిత్తం తవ్విన రోడ్లకు వెంటనే మరమ్మతుల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రజలకెలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు యుద్దప్రాతిపదిన మరమ్మతులు చేపట్టాలని ఆదేవించారు. ఈ తనిఖీల్లో జలమండలి అధికారులు అజ్మీరాకృష్ణ, బి. విజయ్‌కుమార్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ ఇతర అధికారులున్నారు.

నైట్‌షెల్టర్ల నిర్వహణ భేష్

హైదరాబాద్, జూన్ 6: వివిధ కారణాలతో ఇళ్లు విడిచి రోడ్డుకిరువైపులా జీవిస్తున్న వారికి కనీసం రాత్రి పూటనైనా ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్ల నిర్వహణ భేష్‌గా ఉందని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిహెచ్‌ఎంసిని అభినందించింది. దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంబీర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య సాధికారిక కమిటీ మంగళవారం మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా జస్టిస్ కైలాష్ గంబీర్ మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో నిరాశ్రయుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్ల నిర్వహణ మెరుగ్గా ఉందన్నారు. అయితే షెల్టర్లలో ఉండే వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాల్లో నిర్మాణంలో ఉన్న నైట్ షెల్టర్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా హైదరాబాద్‌లో నిరాశ్రయులపై తిరిగి నిపుణులైన స్వచ్చంద సంస్థలచే సర్వే నిర్వాహించాలని ఆయన సూచించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్ల కాలానికి నైట్ షెల్టర్ల నిర్వాహణ, నిర్మాణాలపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
ఏ ఒక్కరూ కూడా నిరాశ్రయులుగా ఉండరాదనే ఉద్దేశ్యంతో ఈ ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన వివరించారు. మహిళా శిశు, సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం బాలబాలికలకు ప్రత్యేకంగా 32 బాల సదనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 12 నివాస కేంద్రాలున్నాయని, వీటిలో ఎనిమిది పురుషులకు, నాలుగు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించామని, వీటిలో నీరు, టాయిలెట్లు, విద్యుత్ తదితర వౌలిక సదుపాయాలను కల్పించటంతో పాటు మంచాలు, బెడ్‌లు, బెడ్‌షీట్స్, దుప్పట్లు, వంట సామాగ్రి, గ్యాస్ స్టౌ, లాకర్లు, టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేశామని వివరించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, ఈఎన్‌టి ఆసుపత్రి, పంజాగుట్ట నిమ్స్, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, మాసాబ్‌ట్యాంక్‌లోని మహావీర్ ఆసుపత్రుల్లో రూ. 12 కోట్ల 14లక్షల వ్యయంతో నైట్ షెల్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరంలో బాల యాచకులపై రకూడా సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలోని 74 పట్టణాల్లో నిరాశ్రయులపై సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో 16 నైట్ షెల్టర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సంజయ్‌కుమార్, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ భాస్కరచారి, పురపాలక శాఖ అధికారులు అనురాధ, వందన్‌కుమార్‌లతో పాటు జలమండలి, ఎస్సీ డెవలప్‌మెంట్, సివిల్ సప్లై శాఖ అధికారులు, పలు స్వచ్చం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.