హైదరాబాద్

జంక్షన్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జిహెచ్‌ఎంసి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు, స్కై వేలు వంటివి నిర్మించే పనులను ప్రారంభించిన జిహెచ్‌ఎంసి అందుకు సమాంతరంగా నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్లను కూడా అభివృద్ధి చేసేందుకు సిద్దమైంది. నగరంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే పలు చౌరస్తాల్లో జంక్షన్లలో తగినంత స్థలం ఉన్న వాహనాలు సజావుగా ప్రయాణించేందుకు అవి అనుకూలంగా లేవన్న విషయాన్ని గుర్తించిన జిహెచ్‌ఎంసి తొలి దశగా 31 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని జంక్షన్ల పనుల కోసం టెండర్లను చేపట్టగా, మరికొన్నింటికి టెండర్లను ఖరారు చేస డిజైన్లను కూడా సిద్దం చేస్తోంది. జంక్షన్లను అభివృద్ధి పర్చటంతో పాటు ఇంకా ఏమైనా స్థలం మిగిలితే అది కాస్త అందమైన లుక్ తెచ్చేలా ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని కూడా అధికారులు భావిస్తున్నారు.
అభివృద్ధి పరిచే..
జిహెచ్‌ఎంసి తొలి దశగా అభివృద్ధి చేయాలనుకున్న జంక్షన్లలో సుచిత్ర జంక్షన్, ఐడిపిఎల్ జంక్షన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. అలాగే పాతబస్తీలోని సిటీకాలేజీ జంక్షన్ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లను పూర్తి చేసి, లీ అసొసియేట్స్ సౌత్ ఏషియా ప్రై.లిమిటెడ్ సంస్థతో పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే శాలిబండ సమీపంలని హిమ్మత్‌పురా, అశోక్‌నగర్, ఖానామెట్‌లోని సైబర్ సిటీ, ప్యారడైజ్, పునారాపూల్ జంక్షన్ల పనులు ప్రస్తుతం టెండర్ల స్థాయిలో ఉన్నాయి. అలాగే ఐఐఐటి జంక్షన్‌లో దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే ప్రణాళికతో అభివృద్ధి చేయాలని టిఎస్‌ఐఐసికి అప్పగించారు. వీటితో పాటు షెనాయ్ నర్సింగ్ హోం, నిజాంకలాజీ, బిఎన్‌రెడ్డి జంక్షన్, హస్తినాపురం, కవాడిగూడ జంక్షన్ల పనులు తుది పరిశీలన, పరిపాలనపరమై మంజూరీ తీసుకునే స్థాయిలో ఉన్నాయి. అలాగే ఫీవర్ ఆసుపత్రి, కర్మాన్‌ఘాట్, రోడ్ నెం. 6 అంబర్‌పేట, రామంతాపూర్ చర్చి టి జంక్షన్, అలీకేఫ్, రాణిగంజ్, నర్సాపూర్ జంక్షన్ల పనులు టెక్నికల్ స్క్రూటినీ స్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు మదీనా, ఎతెబార్ చౌక్, దారుల్‌షిఫా సమీపంలోని శివాజీ బ్రిడ్జి జంక్షన్, బీబీబజార్, హైదర్‌గూడ(అత్తాపూర్), విటికమాన్, కెపిహెచ్‌బి టెంపుల్ బస్టాపు,బోరబండ బస్టాపు, బాలానగర్ జంక్షన్ పనులకు సంబంధించి డిజైనింగ్‌ల కోసం ఇటీవలే కన్సల్టెన్సీకి అప్పగించినట్లు, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టివై మందాలీ, మల్లేపల్లి జంక్షన్, అఫ్జల్‌గంజ్ జంక్షన్ల పనులను ఇటీవలే కన్సల్టెన్సీలకు అప్పగించారు. ఈ మొత్తం 31 జంక్షన్లలో టెండర్లు, ఎజెన్సీ ఖరారైన జంక్షన్ ఒకటి కాగా, 8 టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. అలాగే తుది పరిశఈనలో మరో ఆరుండగా, టెక్నికల్ స్క్రూటినీ స్థాయిలో ఏడు, ఇటీవలవే సమర్పించినవి 9 జంక్షన్లు కాగా, మరో మూడు సమర్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

‘వస్తాడు నారాజు ఈరోజు..’
హైదరాబాద్, జూన్ 13: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మంగళవారం మధ్యాహ్నం నటరాజ కళామందిరంలో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సుమారు మూడుగంటల పాటు సాగిన అన్నదానం సమయంలో వేదికపై సినారె వ్రాసిన గీతాలకు కళాకారులు నృత్యం చేశారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో విజయనిర్మలపై చిత్రీకరించిన ‘వస్తాడు నారాజు ఈ రోజు...’ అనే గీతాన్ని సుకన్య నర్తించింది. పాటలకు అనువైన సెట్టింగ్‌లను సందర్భానుసారంగా మారుస్తూ సినిమా షూటింగ్ జరుగుతోందా అనే విధంగా సినీ సాంకేతిక పరిజ్ఞానంతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
గులేభకావళికథ చిత్రంలో ఎన్టీఆర్, జమున పాత్రలను పోలినట్లు రాచరికపుదుస్తులతో సంతోష్‌రెడ్డి, గీతలు ‘నన్ను దోచుకుందువుటె వనె్నల దొరసాని..’ పాటను నర్తించారు. ఒసే రాములమ్మ చిత్రంలో విజయశాంతి పాత్రను రవీనా నటించి ఆ సన్నివేశాన్ని కనులముందుంచారు. శ్రీకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి నారాయణస్వామి కళాకారులకు జ్ఞాపికలు ప్రదానం చేసి అభినందించారు.