హైదరాబాద్

17న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: ఈ నెల 17న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో జరిగే పరేడ్‌కు భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భారత వైమానిక దళానికి వివిధ విభాగాల్లో ఉన్న ఫ్లయిట్ కేడెట్స్ సర్వీసులో చేరేందుకు ముందుగా తీసుకునే శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమికి చేరుకుని పరేడ్‌లో పాల్గొంటారు. పరేడ్‌లో 120 మంది గ్రాడ్యుయేట్లు పాల్గొననున్నారు. వీరంతా ఫ్లయింగ్, నేవిగేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ఆయా విభాగాల్లో చేరనున్నారు. అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగాల్లో శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారికి కూడా ఆర్మీ జనరల్ ‘వింగ్స్’ను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాల నుంచి సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. ప్రతి ఏటా ఈ పరేడ్ డిసెంబర్, జూన్ నెలలో జరుగుతుంది. ఈసారి పరేడ్‌లో శిక్షణ పొందిన 25 మంది మహిళలు, 95 మంది పురుషులు పాల్గొంటున్నారు.

25 నుంచి గోల్కొండ బోనాలు

హైదరాబాద్ / నార్సింగి, జూన్ 15: ఆషాఢ మాసంలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొనే బోనాల జాతర రానే వచ్చింది. ఈనెల 25వ తేదీ నుంచి గోల్కొండ కోటలో బోనాల జాతరలో భాగంగా శ్రీ జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక తొట్టెల సమర్పణతో రాష్టమ్రంతా బోనాల జాతర ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురువారం గోల్కొండ కోటలోని అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు.