హైదరాబాద్

అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: మహానగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించటంతో తరుచూ చిరు జల్లులు కురుస్తున్నాయి. కానీ గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో నగరంలో ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుని చీకటి ఏర్పడింది. వాహనదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం నాలుగు గంటలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. రానున్న రెండురోజుల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఇప్పటికే జిహెచ్‌ఎంసి, ఇతర ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. అంతేగాక, ఇప్పటికే సిద్ధంగా ఉన్న జిహెచ్‌ఎంసి బృందాలు రంగంలోకి దిగాయి. మూడు నాలుగు గంటల ముందే భారీ వర్షాల సమాచారాన్ని తెలుసుకునేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. బాగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖతో సంప్రదింపులు జరపుతూ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. శివార్లలో పైప్‌లైన్ విస్తరణ కోసం తవ్విన రోడ్లకు యుద్ధప్రాతిపదికన ఒకవైపు మరమ్మతులు చేపడుతున్న జలమండలి కూడా అత్యవసర బృందాలను సిద్దం చేసింది. చిన్నపాటి వర్షానికే మెయిన్‌రోడ్లపై భారీగా వర్షపు నీరు నిల్వటంతో కానీ జనజీవనానికి, ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయమేర్పడింది. కోర్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్లు, ట్రాఫిక్ జంక్షన్లలో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ఖైరతాబాద్, అమీర్‌పేట, రాణిగంజ్, లక్డీకాపూల్, బైబిల్‌హౌజ్, ఎం.జె.మార్కెట్, కోఠి, పాతబస్తీలోని చార్మినార్, లాల్‌దర్వాజ, హుస్సేనీ ఆలం తదితర ప్రాంతాల్లో రోడ్డుపై వర్షపు నీరు నిల్చిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. దీంతో పాటు నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో కిటకిటలాడే లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వర్షం కురిసిన దాదాపు గంట సేపు కూడా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రాణిగంజ్ చౌరస్తాలో వర్షపు నీరు నిల్చిపోవటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. చెట్లు విరిగిపడటం, రద్ధీగా ఉండే రహదార్లపై మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిల్వటం, అలాగే గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అయినా ఎక్కడా కూడా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టినట్టు కన్పించలేదు.

నేడు సిటీలో కెటిఆర్ పర్యటన

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు శుక్రవారం మరోసారి నగరంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రజల దాహర్తిని తీర్చేందుకు సుమారు రూ. 1900 కోట్ల హడ్కో నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే సిద్దమైన ఐదు రిజర్వాయర్లను మంత్రి ప్రారంభించనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అలాగే బాగ్‌లింగంపల్లి తాండా, మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం అహ్మద్‌గూడల్లో కలిపి మొత్తం 4554 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
బాల్య వివాహం నిలిపివేత
కులకచర్ల, జూన్ 15: బాల్య వివాహం చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు, బాలల హక్కుల పరిరక్షణ సిబ్బంది కౌనె్సలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలుపుదల చేసిన సంఘటన కులకచర్ల మండలం అడవివెంకటాపురంలో లాల్‌సింగ్ తండాలో జరిగింది. వివరాల్లోకి వెలితే.. తండాకు చెందిన సబావత్ గోపాల్ కూతురు 16 ఏళ్ల అమ్మాయికి శుక్రవారం వివాహం జరాగాల్సి ఉంది. ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలలహక్కుల పరిరక్షణ సిబ్బందికి సమాచారం అందడంతో పిల్ల వయసు కేవలం 16 ఏళ్లున్నట్లు గుర్తించి కులకచర్ల తహశీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. కుటుంబీకులను, పెళ్లి పెద్దలను పిలిచి సర్పంచ్, అంగన్‌వాడీ కార్యకర్త సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించి పెళ్లీడు వచ్చాకే వివాహం జరిపిస్తామని హమీ పత్రం రాయించుకున్నారు. దొంగచాటుగా పెళ్లి చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్‌ఐ చంద్రకాంత్ హెచ్చరించారు.