హైదరాబాద్

నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. నిరుద్యోగులను నిండా ముంచుతోందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆకేళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్ధులకు గ్రూప్-1, గ్రూప్-2తోపాటు వివిధ పోటీ పరీక్షలకు రాయితీపై శిక్షణ ఇప్పించడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు రాఘవేంద్రతో కలిసి శిక్షణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసమనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. రాజకీయ పదవులను భర్తీ చేస్తున్న కేసిఆర్.. ఉద్యోగాలను మాత్రం కల్పించడం లేదని ఆరోపించారు. తెలంగాణ వచ్చింది రాజకీయ పదవుల కోసమేనా అన్నట్టు మారిందని విమర్శించారు. ఈ ధోరణిని వీడి ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధోరణి మారకంటే అఖిలపక్షంతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.