హైదరాబాద్

ఆస్తిపన్ను చెల్లింపులపై 1 నుంచి 2శాతం వడ్డీ వర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: కోటి మంది జనాభా కల్గిన మహానగరంలో పౌర సేవల నిర్వాహణ, అభివృద్ధి కోసం జిహెచ్‌ఎంసికి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను చెల్లింపులపై వచ్చే నెల 1వ తేదీ నుంచి వడ్డీ వర్తింపజేయనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. చెల్లించాల్సిన మొత్తం పన్నుల్లో ప్రతి నెల రెండు శాతం వడ్డీని విధించనున్నారు. అంతేగాక, వర్తమాన ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన 30వేల మందిలో సకాలంలో, నగదు బహుమతుల స్కీం గడువులోపు చెల్లించిన 119 మందిని డ్రా ద్వారా ఎంపిక చేసి నగదు బహుమతులను కూడా ప్రకటించారు. నగదు పురస్కారాల గడువులోపు సుమారు 30వేల మంది రూ. 14.77 కోట్లను చెల్లించగా, మరో 1123 మంది వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సుల ఛార్జీలను చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో ఇప్పటికే పేరుకుపోయిన వందలాది కోట్ల మొండి బకాయిల వసూళ్లు జిహెచ్‌ఎంసి భారంగా మారిన నేపథ్యంలో మున్ముందు భారీ మొత్తంలో మొండి బకాయిలు పేరుకుపోకుండా ఉండేందుకు గాను బకాయిదారులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే మొత్తం వార్షిక పన్నును చెల్లించేందుకు ముందుకొచ్చేందుకే ఈ నగదు పురస్కారాలను ప్రకటించింది. అంతేగాక, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాది చివర్లో ఆస్తిపన్నునుపై వడ్డీని మాఫీ ఎత్తివేయటాన్ని కూడా సర్కారు రద్దు చేసింది. దీనికి తోడు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించే వారికి వర్తింప జేసే ట్రాన్సాక్షన్ ఛార్జీలను కూడా ఎత్తివేయటంతో ఆన్‌లైన్ చెల్లింపులు కూడా పెరిగాయి. ఈ రకమైన పరిణామాలతో మున్ముందు పెద్దగా మొండి బకాయిలు పేరుకుపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అంతేగాక, గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే వచ్చే సంవత్సరం మార్చి 2018లో కూడా పన్నుపై వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయకుంటే సుమారు రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు అదనంగా వసూలయ్యే అవకాశముంది.
పన్ను కట్టి..బహుమతులు గెలిచి..
వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే వార్షిక పన్నును చెల్లించిన వారికి తరుచూ డ్రా ద్వారా ఎంపిక చేస్తూ జిహెచ్‌ఎంసి నగదు పురస్కారాలను ప్రదానం చేస్తూ వస్తోంది. అలాగే ఈ నెల 18వ తేదీలోపు చెల్లించిన వారిని ఎంపిక చేసి, మంగళవారం డ్రా నిర్వహించి వారిలో విజేతలను ఎంపిక చేసి బహుమతులను ప్రకటించింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె
కాచిగూడ, జూన్ 20: స్వర్గీయ డా.సి.నారాయణరెడ్డి అన్ని ప్రక్రియలలో రచనలు చేసి సాహిత్యన్ని పండించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలంగాణ బిసి కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానా శాస్ర్తీచే ఈనెల తెలుగు పాఠంలో భాగంగా ‘సినారె వ్యక్తిత్వం - సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం సినారె - వంశీ విజ్ఞాన పీఠం, ద్వానా సాహితీ కుటీరం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. సినారె రచించిన పాటలు ఎంతో మధురంగా ఉన్నాయని, నేటికి ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం ద్వానా శాస్ర్తీ.. సినారె వ్యక్తిత్వం - సాహిత్యంపై ప్రసంగించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు.