హైదరాబాద్

బిహెచ్‌ఇఎల్‌లో రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: బిహెచ్‌ఇఎల్ రిటైర్డు ఉద్యోగు సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటంతో ఇప్పటి వరకు రిటైర్డు అయిన తొమ్మిది వేల మందికి నిత్యం సహాయ సహాకారాలు అందించుకునే అవకాశం ఏర్పడిందని బిహెచ్‌ఇఎల్ మొట్టమొదటి రిటైర్డు ఈడి ఎం.ఆర్. నాయుడు అన్నారు. అంతేగాక, ఈ సంఘానికి గౌరవ సలహాదారుడిగా ఐఎన్‌టియుసి అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి ఉండటం గొప్ప విషయమని ఆయన వ్యాఖ్యానించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు రాజనర్సయ్య, ప్రధన కార్యదర్శి భాగ్యారావు ఆధ్వర్యంలో సంఘం నేతలు నాయుడు నివాసానికి వచ్చి మొట్టమొదటి సభ్యత్వం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ రిటైర్డు అయిన వేలాది మంది ఉద్యోగుల ఎన్నో సమస్యలతో సతమతమవుతూ, ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని వివరించారు. ఈ సంక్షేమ సంఘం ఏర్పాటు ఒక ముందడుగని ఆయన అభినందించారు. రాజనర్సయ్య మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులకు ఏదైనా సమస్య వస్తే సంక్షేమ సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనే కార్మిక పితామహుడు, జాతీయ కార్మిక సంఘం చైర్మన్ జి. సంజీవరెడ్డి అండదండలతో సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ సంఘానికి సంబంధించి మొట్టమొదటి సభ్యత్వం తొలి రిటైర్డు ఈడి నాయుడుకు అందజేయటం శుభపరిణామంగా పేర్కొన్నారు. నాయుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సంస్థ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని అభినందించారు. రిటైర్డు ఉద్యోగుల సంక్షేమమే తమ సంఘం ప్రధాన అజెండా అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు భీమిరెడ్డి, శ్రీహరి, యాదగిరిరావు, జోసఫ్‌రెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.