హైదరాబాద్

టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి కంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: అవినీతికి పాల్పడేవారెంతటి వారైనా వదిలేదిలేదు.. చివరకు నా రక్తసంబంధీకులైనా అవినీతికి పాల్పడితే శిక్షించండి! అవినీతిపరులను చీల్చి చెండాడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పలు కార్యక్రమాల్లో ఆదేశించినా, క్షేత్ర స్థాయిలో ఆ ఆదేశాలు ఏ మాత్రం అమలుకు నోచుకోవటం లేదు. పైగా అధికారుల అవినీతికి అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిలో భవన నిర్మాణ అనుమతులు మొదలుకుని ఇతర సేవలందించేందుకు మధ్యవర్తులు, దళారీల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఆన్‌లైన్ సేవలను ప్రారంభించినా, అక్రమార్కుల అవినీతి ఏ మాత్రం ఆటంకం లేకుండా యథేచ్ఛగా కొనసాగుతోంది. భవన నిర్మాణ అనుమతి కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకున్నా, దరఖాస్తుదారుడు జతపర్చిన డాక్యుమెంట్ల పరిశీలన, సైటు సందర్శనల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఇల్లు కట్టుకుంటున్న ఓ యాజమాని టౌన్‌ప్లానింగ్ అధికారులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేపథ్యంలో అవినీతి పరుల భరతం పడుతామని సిఎం కెసిఆర్ ప్రకటించినా, నీటికి ఒక్క అవినీతి అధికారికి కనీసం బదిలీ కూడా కాలేదు. ఈ విభాగంలో అవినీతి అడ్డుకునేందుకు ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తూనే, దానికి సమాంతరంగా చాలా కాలంగా సీట్లకు అతుక్కుపోయిన సర్కిల్ స్థాయి అసిస్టెంటు సిటీ ప్లానర్లను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. డిప్యూటీ కమిషనర్ల బదిలీల కన్నా ముందే టౌన్‌ప్లానింగ్ ప్రక్షాళన కోసం స్థానచలనం కల్గించాల్సిన అధికారుల జాబితా సిద్ధమైనా, నేటికీ అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. ఈ బదిలీలను ఆపేందుకు కొందరు యూనియన్ నేతలు, రాజకీయ నేతలు సచివాలయం నుంచి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. చేతికి రంగు కాగితాలందుతాయంటే చాలు ఎంత ఆఘాయిత్యానికైనా టౌన్‌ప్లానింగ్ అధికారులు పాల్పడుతారన్న విషయం దిల్‌సుఖ్‌నగర్‌లో యజమాని ఆత్మహత్యతో తేలిపోయింది. ఇదిలా ఉండగా, తాజాగా సర్కిల్ 10 పరిధిలోకి వచ్చే సనత్‌నగర్, బల్కంపేట, కె.బి.గూడ పరిసర ప్రాంతాల్లో టౌన్‌ప్లానింగ్‌కు చెందిన అధికారి ఫుట్‌పాత్‌లపై వ్యాపార సంస్థలకు అండదండగా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి షాపునుంచి బాహాటంగానే నెలసరి మామూళ్లు స్వీకరిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆక్రమణలను తొలగిస్తామంటూ ఒకవైపు ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటనలో చేస్తుంటే ఈ రకంగా ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారేంటీ? అని ప్రశ్నించగా, మహా అయతే ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తారు? అంతకన్నా ఎక్కువేం చేయరు కదా! అంటూ సమాధానమిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయ.

నేటి నుంచి హైదరాబాద్ సెయలింగ్ వారోత్సవం
* హుస్సేన్‌సాగర్‌లో నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 27: గత 32 ఏళ్ల నుంచి జరుగుతున్న హైదరాబాద్ సెయలింగ్ వారోత్సవాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఈ నెల 28 నుంచి జులై 8 వరకు ఈ వారోత్సవం జరుగనుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈఎంఈ సెయలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయలింగ్ క్లబ్ సంయుక్తంగా సెయలింగ్ వారోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈఎంఈ సెయలింగ్ అసోసియేషన్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ కెకె అగర్వాల్ తెలిపారు. ఈఎంఈ సెయలింగ్ అసోసియేషన్ 1964లో ఏర్పడింది. ఈ సైలింగ్ వారోత్సవాల్లో విజేతలైన వారికి ‘సీనియర్ మల్టీ క్లాస్ చాంఫియన్‌షిప్ 2017’గా డిక్లేర్ చేస్తారు. సుమారు 200 రకాల పడవలు ఈ పోటీల్లో ఆకర్షణీయంగా నిలువనున్నాయి. సీనియర్, ఒలింపిక్ విభాగాల్లో కలిపి మొత్తం 96 రేస్‌లు జరుగనున్నాయి.