హైదరాబాద్

‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: జిల్లా విస్తీర్ణం, జనాభా, వౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల వివరాలతో రూపొందించిన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ బుక్‌లెట్ అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహామ్మారిని తరిమికొట్టడంలో ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. నగరాన్ని డ్రగ్స్ రహిత సిటీగా తీర్చిదిద్దేందుకు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ముద్రించిన పోస్టర్‌ను కూడా ఇన్‌చార్జి కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఆర్వో సతీష్‌చంద్ర, సిపివో బలరాం, హైదరాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు భీంరెడ్డి పాల్గొన్నారు.