హైదరాబాద్

భక్తులతో కిటకిటలాడిన శ్యాంబాబా ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఆగస్టు 15: శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను పురస్కారించుకుని కాచిగూడ వీరన్నగుట్టపై వెలసిన శ్యామ్‌మందిర్ భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం రాత్రి ఆలయంలోని రాధామాధవుల విగ్రహాల వద్ద వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉత్సవాలను సందర్భంగా ఆలయ నిర్వహకులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి పాటలు పాడి విశేషంగా ఆకట్టుకున్నారు. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణతో రాధామాధవులను దర్శించుకున్నారు. రితూ పంచాలన్‌చే భజనసంధ్య భక్తులను ఎంతోగానో ఆకట్టుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులను కలుగకుండా శ్రీశ్యామ్‌సేవా సమితి కార్యదర్శి ఇంద్రకరణ్ అగర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీశ్యామ్ సేవా సమితి అధ్యక్షుడు అశోక్‌కుమార్, టిబ్రేవాల్, రాందేవ్ అగర్వాల్ పాల్గొన్నారు. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ పర్యవేక్షించారు.
భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి
షాద్‌నగర్: ఉట్లుకొట్టే కార్యక్రమాన్ని యాదవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ పురపాలక సంఘం కార్యాలయం సమీపంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉట్లు కొట్టే కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఎల్గనమోని అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి ఉట్లుకొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి రోజు తరువాతే గోకులనందనుడు, బృందావన విహారి, ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణ్భగవానుడు జన్మించిన మరుసటి రోజు యాదవులు ఉట్లుకొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం తాలుకా అధ్యక్షుడు చీపిరి రవి యాదవ్, నడికూడ రఘునాథ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, అశోక్‌యాదవ్, రేనికేశ్ యాదవ్, దంగు శ్రీనివాస్ యాదవ్, గడ్డం సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జిల్లేల వెంకట్‌రెడ్డి, ఎంఎస్ నటరాజ్, బచ్చలి నర్సింహ్మ, జాంగారి రవి, కృష్ణయాదవ్, శివ, శ్రీను పాల్గొన్నారు.