హైదరాబాద్

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం భాగ్యనగరం త్రివర్ణ శోభను సంతరించుకుంది. చిన్నచిన్న సంస్థలు మొదలుకుని కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, వివిధ ప్రభుత్వా ఆఫీసులన్నింటిలోనూ జాతీయ ఎండను ఎగురవేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని దేశభక్తి, సమైక్యతాభావాన్ని చాటారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థల్లోనూ రోజురోజుకీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే వేదికలు గణనీయంగా పెరగటం యువత, ఉద్యోగుల్లో దేశభక్తి, జాతీయ సమైఖ్యత భావన పెంపునకు నిదర్శనం. మంగళవారం నగరంలోని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, రాజకీయపార్టీల ఆఫీసులతో పాటు లేబర్ అడ్డాల్లో, డ్రైవర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఏటా అత్యుత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను, పతకాలను, పురస్కారాలను ప్రదానం చేశారు. మరికొన్ని కూడళ్లు, మురికివాడల్లో ప్రజలు విభేధాలకతీతంగా వేడుకలు జరుపుకుని తమ దేశభక్తిని చాటుకున్నారు. మరికొన్ని చోట్ల పతాకావిష్కరణ జరిగిన తర్వాత విద్యార్థులు, చిన్నారులకు వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించి విజేతలను ఎంపిక చేసి అప్పటికపుడు బహుమతులను కూడా ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా, పలు ప్రాంతాల్లో తెలంగాణవాదులు రెట్టింపు ఉత్సాహాంతో స్వాతంత్య్ర దినోత్స వేడుకలను జరుపుకున్నారు. గోల్కొండ కోటలో ప్రభుత్వం తరపున పంద్రాగస్టు వేడుకలు అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఘనంగా జరిగాయి. మరికొన్ని చోట్ల, పలు కార్పొరేట్ సంస్థల్లో ఉదయం జాతీయ పతాకాన్ని ఎగురవేసి సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో సంబరాలు జరుపుకున్నారు.

మెరుగైన ర్యాంకే లక్ష్యం

హైదరాబాద్, ఆగస్టు 15: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, వాహనదారులకు ఉపశమనం కల్గించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపి పనుల ప్రభావం ఏడాదిలోపు మొదలవుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి చారిత్రక నగరంలో వౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ఎస్‌ఆర్‌డిపిని అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. వీటిలో అధిక శాతం పనులు వచ్చే సంవత్సరం నాటికి పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.