హైదరాబాద్

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని అడ్డుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడి కారణంగా విద్యార్థులెన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ దోపిడీని అరికట్టి, అన్ని సౌకార్యలతో కూడిన విద్యనందించాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు బిజెపి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అక్షరాస్యతలో తెలంగాణ చాలా వెనుకబడిందని వివరించారు. తెలంగాణలో విద్యారంగం మొత్తం ప్రైవేటు పరంగా నడస్తుందని, ఈ క్రమంలో పేద విద్యార్థులకు నాణ్యమైన కేజి టు పిజి ఉచిత విద్యను అందిస్తామన్న పాలకులు మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు ప్రైవేటు పాఠశాలల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా 40లయల మంది విద్యార్థులకు ఉచిత గురుకుల నిర్భంధ విద్యను అందిస్తామన్న సర్కారు హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదన్నారు. మూడేళ్ల తర్వాత పలు చోట్ల గురుకులాలను ప్రారంభించినా, అక్కడ కనీస వసతుల్లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ప్రైవేటు విద్యా సంస్థల భరతం పడతా అన్న ముఖ్యమంత్రికి గడిచిన మూడేళ్లలో యువ మోర్చా చేసిన ఫిర్యాదులపై ఏ మాత్రం స్పందించలేదన్నారు. సామాన్య, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా చదువుకునే ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు కళ్లెం వేయాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టును సైతం అమలు చేయటం లేదని విమర్శించారు. యువమోర్చా ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాల నియంత్రణపై ఉద్యమం చేపడితే ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసినా, స్కూళ్లు మొదలై మూడు నెలలు గడుస్తున్నా, నేటికీ ఆ కమిటీ నివేదిక సమర్పించకపోవటం శోచనీయం అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటరమణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు భరత్‌గౌడ్, బిజెవైఎం స్టేట్ ప్రెసిడెంటు టి. రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.