హైదరాబాద్

మహాగణపతి పూజకు గవర్నర్‌కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 22: ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి మొదటి పూజకు రావాలని గవర్నర్ నరసింహన్‌ను ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. 63వ సంవత్సరం శ్రీ చంఢీ కుమార అనంత మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథున్ని తీర్చిదిద్దినట్లు గవర్నర్‌కు వివరించారు. కుడివైపు తపోదీక్షలో ఉన్న మహాశివుడు, ఎడమవైపు మహిషాసురమర్ధిని విగ్రహాలు కొలువుదీరగా, ఏకదంతుని చెంతన సుబ్రహ్మణ్యస్వామి, కనకదుర్గమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈనెల 25న జరిగే మొదటి పూజలో గవర్నర్ దంపతులు హాజరై గౌరీ తనయునికి మొదటి పూజ నిర్వహించనున్నారు. ఐదేళ్లుగా గవర్నర్ నర్సింహన్ ఖైరతాబాద్ గణపతికి మొదటి పూజ నిర్వహిస్తున్నారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా పూజలు నిర్వహించాలని గవర్నర్ దంపతులను ఆహ్వానించింది. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, వంశీ, మహేష్, ప్రేమ్‌రాజ్ గవర్నర్‌ను కలిసిన వారిలో వున్నారు.