హైదరాబాద్

ప్రతివారం హాస్టళ్లను తనిఖీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర హాస్టళ్లను అధికారులు ప్రతివారం తనిఖీ చేయాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం హాస్టళ్ల పనితీరు, మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు అందజేయాల్సిన ఆహారాన్ని తప్పనిసరిగా ఫ్లెక్సీపై డిస్‌ప్లే చేయాలని, ఒక్కోక్క విద్యార్థికి కాకుండా ఆయా హాస్టళ్లలోని మొత్తం విద్యార్థులకు అందజేయాల్సిన ఆహారం వివరాలను పొందుపర్చాలన్నారు. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే పరీక్ష గ్రేడింగ్‌ను కూడా సంబంధిత హాస్టళ్లలో డిస్‌ప్లే చేయాలని సూచించారు. వసతి గృహాల్లో ఎన్ని ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి? ఎన్ని ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి? వౌలిత సదుపాయాల, డిజిటల్ తరగతులు వంటి అంశాలపై పూర్తి వివరాలను ఈ నెల 26 కల్లా తనకు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. అలాగే ఆయా హాస్టళ్లలో పనిచేస్తున్న వార్డెన్, కుక్, కామాడిలు తప్పనిసరిగా ఆయా హాస్టళ్లలోనే నివసించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వసతి గృహాల్లో ట్యూటర్ల గురించి ప్రస్తావిస్తూ ఆమె విద్యా వాలెంటీర్లు, సిఆర్‌పిఎఫ్‌లలో కొంతమందిని ఎపిక చేసి వారిచే విద్యాభోధన చేసేలా నియమించాలని డిఈవోను ఆదేశించారు. జిల్లాలో ముఖ్యమైన అంశాలైన ప్రజావాణి, విద్యా, వైద్యం, ఐసిడిఎస్ వంటి కార్యక్రమాలు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ వాటి పనితీరు మెరుగుపరిచేందుకు తగు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం నుంచి నలుగురు అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించినట్లు, తమ సమస్యలను వారితో ఎప్పటికపుడు సంప్రదిస్తొ పరిష్కరించుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ఇకపై ప్రతి శాఖలో అమలు చేసే ఆర్థిక అభివృద్ధి పథకాల పురోగతిని తాను వారానికోసారి సమీక్షించనున్నట్లు ఆమె తెలిపారు. వివిధ శాఖల ద్వారా గ్రౌండ్ అయిన యూనిట్ల వివరాలను ఖచ్చితంగా సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. అపతి పథకం గ్రౌండింగ్‌ను నిర్ణీత సమయంలో పూర్త చేసేందుకు కార్యచరణను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈవో రమేష్, ఎల్‌డిఎం నాగేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళా వందనం తదితరులు పాల్గొన్నారు.
అంశాల వారీగా నియమితులైన అధికారులు
జిల్లాలో పలు ప్రాధాన్యత కల్గిన అంశాలు, కార్యక్రమాలను మెరుగైన రీతిలో అమలు చేసేందుకు ఆయా శాఖల పనితీరును ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు అంశాల వారీగా కలెక్టర్ అధికారులను నియమించారు. ఇందులో ప్రజావాణి కార్యక్రమానికి స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ శ్రీ వత్స కోట, విద్యాశాఖకు సికిందరాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ నిఖిల, ఐసిటిఎస్‌కు ఎల్‌పివో రాధిక రమణీలను నియమించారు.