హైదరాబాద్

మస్కిటో యాప్‌కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 12: దోమల వ్యాప్తిని నిరోధించడంలో ప్రజలను చైతన్యపరిచేందుకు అందుబాటులోకి తెచ్చిన మస్కిటో యాప్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఒక దోమ ద్వారా సంవత్సర కాలంలో ప్రపంచ జనాభాకు సమానమైన దోమలు వృద్ధి చెందుతాయని, దోమకాటుతో వ్యాప్తిచెందే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన యాప్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) రూపొందించింది. ఆధునిక సాంకేతికతను జోడించి తీర్చిదిద్దిన ఈ యాప్‌ను గతనెల 20న అందుబాటులోకి తెచ్చారు. కేవలం 20 రోజుల్లోనే 40వేల మంది ఈ యాప్‌ను డోన్‌లౌడ్ చేసుకొని దోమల పుట్టుక, పునరుత్పత్తి, వాటితో సంక్రమించే వ్యాధులు, నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో దోమల స్వైరవిహారంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడటం పెను సమస్యగా మారుతుంది. మహానగర పాలక మండలి ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో అవి ఫలితాలు రావడం లేదని గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిత్యం బిజీగా ఉండే నగరవాసులను చైతన్య పరిచేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించారు. అన్ని హంగులతో ఈ యాప్‌ను రూపొందించి, విడుదల చేశారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ప్రత్యేక పోటీని సైతం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. 16 ప్రశ్నలు కలిగిన ఈ పోటీల్లో పాల్గొని సరైన సమాధానాలు చెప్పిన వారిని డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు ఇవ్వనున్నారు. సంవత్సర కాలంలో 20 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకునేలా బల్దియా ప్రయత్నిస్తున్నట్టు కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు.

నిమ్స్‌లో కౌనె్సలింగ్ కష్టాలు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 12: ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుల నియామకం కోసం మంగళవారం నిర్వహించిన కౌనె్సలింగ్‌లో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండానే యాజమాన్యం కౌనె్సలింగ్ ప్రక్రియను కొనసాగించింది. సమాచార కేంద్రం వద్ద తాత్కాలికంగా ఏర్పాటుచేసిన టెంట్‌లో కౌనె్సలింగ్ నిర్వహించారు. 500 మంది అభ్యర్థులు హాజరు కాగా మంచినీటిని సైతం అందుబాటులో ఉంచలేదు. దీంతో అభ్యర్థులు, వారికి సహాయంగా వచ్చినవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో పేరున్న నిమ్స్ ఆసుపత్రిలో కౌనె్సలింగ్‌ను ఈ తరహా నిర్వహించడం దారుణమని అభ్యర్థులు వాపోయారు.