హైదరాబాద్

శరవేగంగా నైట్‌షెల్టర్లు పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 12: మహానగరంలో ఎలాంటి అవాసం లేకుండా నిరాశ్రయులుగా ఉన్నవారికి ఆశ్రయం కల్పించేందుకు నిర్మిస్తున్న నైట్‌షెల్టర్లను త్వరతిగతగిన పూర్తి చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి నాటికి నగరంలో మరో మూడు నైట్ షెల్టర్లను అందుబాటులోకి తెవాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. మహానగర పాలక మండలి పరిధిలో నైట్ షెల్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం ఎనిమిది నైట్ షెల్టర్ల నియామకం కోసం 15.75 కోట్లు జిహెచ్‌ఎంసి కేటాయించింది. మంగళవారం ఈ అంశంపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కింగ్‌కోఠిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో రూ.1.95కోట్లతో చేపట్టిన షెల్టర్, మహావీర్ ఆసుపత్రిలో రూ.1.42కోట్లతో షెల్టర్, ఉస్మానియా ఆసుపత్రిలో రూ.2.77కోట్లతో నిర్మించిన షెల్టర్ పనులు పూర్తయినట్టు కమిషనర్‌కు వివరించారు. వీటితో కోఠి ఇఎన్‌టి ఆసుపత్రిలో రూ.2.90 కోట్లతో జి ప్లస్ 2 నిర్మాణంలో ఉందని, నిమ్స్ ఆసుపత్రిలో రూ.2.16కోట్లతో, రూ.2.60 కోట్లతో నిలోఫర్ ఆసుపత్రుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పూర్తయిన వాటికి మెరుగులు దిద్ది, సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తేవడంతో పాటు నిర్మాణంలో ఉన్న వాటిని సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
కొనసాగుతున్న సర్వే
నగరంలో నిరాశ్రయులు ఎంత మంది ఉన్నారనే అంశాన్ని తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మరకు నగరంలో సర్వే కొనసాగుతుంది. ఈనెల 16 వరకు కొనసాగనున్న సర్వేలో నగరవ్యాప్తంగా నిరాశ్రయులను గుర్తించి నిర్మాణాల్లో ఉన్న నైట్ షెల్టర్లకు తరలించనున్నారు.