హైదరాబాద్

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: బతుకమ్మ వేడుకలను ఈనెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుండి బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, సాంస్కృతిక కార్యదర్శి బి.వెంకటేశంతో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత మొదటిసారిగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నందున ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌లను ఆదేశించారు. తెలంగాణలోని మహిళలు గొప్పగా చేసుకునే ఈ పండుగ దేశ, విదేశాలలోని తెలుగువారు కూడా పెద్దఎత్తున నిర్వహిస్తున్నారని అన్నారు. గత సంవత్సరం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడానికి రాష్ట్ర యంత్రాంగం కృషి చేసినట్లుగానే ఈసారి కూడా దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలను పెద్దఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. పండుగను జిల్లాలోని మహిళా ప్రముఖులు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు అధికారులందరి భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ మాట్లాడుతూ జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్డిఓ ప్రశాంత్ కుమార్, ఉమారాణి, డిఎస్‌ఓ గౌరీశంకర్ పాల్గొన్నారు.
వికారాబాద్ : బతుకమ్మ పండుగలను జిల్లాలో 27న ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మిర చందులాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశంతో కలిసి బతుకమ్మ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేయాలని సూచించారు.
విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలను సైతం నిర్వహించాలని కలెక్టర్లతో అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ మొదటిసారిగా జిల్లాలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో అనంతగిరి, కోట్‌పల్లి ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ జి.సంధ్యారాణి, డిఆర్‌డివో పిడబ్ల్యు జాన్సన్ పాల్గొన్నారు.