హైదరాబాద్

ఐఆర్‌ఇఆర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఐఆర్‌ఇఆర్) పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకుడు విష్ణు ఆదేశించారు. ఎల్‌బినగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఐఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల పరిశీలకుడు విష్ణు, జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్‌తో కలిసి ముమ్మర ఓటర్ల జాబితా సవరణ-2017పై సమావేశాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు.
జిల్లాలోని నాలుగు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి చేపడుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు బాధ్యతతో జాబితా సవరణ నిర్వహించాలని సూచించారు. మొదటిసారిగా ఓటర్ల నమోదుకు వెళ్లే సిబ్బందికి ట్యాబ్లెట్ కంప్యూటర్లు, సింకార్డులు అందజేశామని, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు చేసే కార్యక్రమం మందకొండిగా సాగుతుందని పనిలో వేగవంతం పెంచాలని సూచించారు. ఇర్‌ఒలు ఆయా రాజకీయ పార్టీలతో ఎప్పటికప్పుడు సమావేశం జరిపి వారి సూచనలు, సలహాలు తీసుకొని సమస్యలున్న చోట సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఎల్‌బినగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1978 పోలింగ్ కేంద్రాలకు 1978 బూత్ లెవల్ అధికారులు, 198 మంది పర్యవేక్షకులను, 1978 డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించి ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా అధికారులు కృషి చేయాలని కోరారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సకాలంలో జీతాలు చెల్లించే విధంగా చూడాలని కోరారు.