హైదరాబాద్

షీ-టాయిలెట్ల ఏర్పాటు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు జిహెచ్‌ఎంసి చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా షీ టాయిలెట్ల ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి. నగరంలోని 40 ప్రాంతాల్లో పనులను జోరుగా సాగుతున్నాయి. అత్యంత ఆధునిక పద్దతితో రూపొందించిన ఈ షీ టాయిలెట్లను నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, కమర్షియల్, రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు.
నగరంలో మొత్తం వంద షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న జిహెచ్‌ఎంసి ఇప్పటి వరకు 40 షీ టాయిలెట్లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏర్పాటు చేస్తోంది. ఇందులో మొదటి దశగా 15 షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో 11 టాయిలెట్ల నిర్మాణ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మిగిలిన నాలుగు టాయిలెట్ల నిర్మాణ పనులను పురోగతిలో ఉన్నాయి. మొదటి దశలో చార్మినార్‌లో రెండు, కృష్ణకాంత్ పార్కు, మైత్రివనం, ఆరంఘర్ చౌర, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు, పాస్‌పోర్టు ఆఫీసు, హబ్సిగూడ జిహెచ్‌ఎంసి గ్రౌండ్, మెహిదీపట్నం బస్టాపు, కోఠి ఉమెన్స్ కాలేజీ, శిల్పారామం బస్టాండు, సికిందరాబాద్ బస్టాండు, పార్కులేన్, గొల్కొండ, పబ్లిక్‌గార్డెన్స్‌లలో ఏర్పాటు చేశారు.
రెండో దశలో 25 షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఏడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సుందరయ్య పార్కు, కోఠి ఉమెన్స్ కాలేజీ, ఉప్పల్‌రింగురోడ్డు, లింగంపల్లి బస్టాపు, జూపార్కు సమీపంలో రెండు, పనామా గొడౌన్‌ల ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్లను ప్రస్తుతం ప్రజలు విజయవంతంగా వినియోగిస్తున్నారు.
ఇలాంటి ఎలక్రాన్టిక్ టాయిలెట్లు ప్రస్తుతం చెన్నై, బెంగుళూరు, న్యూదిల్లీ, ముంబై లాంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టాయిలెట్లు ఇపుడు నరగరవాసులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. అత్యంత వ్యయంతో కూడిన ఈ టాయిలెట్లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా వివిధ సంస్థల నుంచి విరాళాలను సేకరించి ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా ఈ టాయిలెట్లలో ప్రత్యేకంగా మహిళల కోసం షీ టాయిలెట్లు, పురుషుల కోసం హి టాయిలెట్లను ఏర్పాటు చేస్తోంది. రెండేళ్ల వరకు వీటి నిర్వహణ బాధ్యతలను కూడా సరఫరా చేసిన సంస్థలే నిర్వహిస్తాయి.
అత్యాధునికం
షీ టాయిలెట్‌ల ఎంతో అత్యాధునికంగా రూపొందించిన వీటి వినియోగం చాలా సులభమేనని చెప్పవచ్చు. వీటిలో ఏ విధమైన క్లాత్‌లతో కూడిన వ్యర్థాలను వేసినా అంతర్గతంగా ఆమ్ల రసాయిన ప్రక్రియతో వాటిని పూర్తిగా కాలిపోయేలా ఇందులో ఏర్పాటు చేశారు. ఒకసారి ఉపయోగించిన వెంటనే పరిశుభ్రం చేసుకునే వ్యవస్థ ఈ టాయిలెట్లలో ఉండటం ప్రత్యేకం. వీటి నిర్వహణను వీటిని నేర్పాటు చేసిన బెంగుళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచే ఆన్‌లైన్‌లో కెమెరాల ద్వారా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. కాగా, నగరవాసులు సౌకర్యార్థం జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్లతో పాటు గాంధేయ పద్దతిలో వివిధ వర్గాలు, సంస్థలను ఒప్పించి నగర జనాభాకు సరిపడే విధంగా అందుబాటులో తెచ్చేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా కృషి చేస్తోంది.
సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

ఎస్‌పిహెచ్‌వోలు తప్పనిసరిగా ఫలితాలు సాధించాలి
*సమీక్షలో కలెక్టర్ యోగితారాణా ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 21: సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని, వచ్చే పదిహేను రోజుల్లో ఈ అంశంపై మంచి ఫలితాలు వచ్చేలా ఎస్‌పిహెచ్‌వోలు కృషి చేయాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. గురువారం ఇన్‌చార్జి జేసి నిఖిల, డిఎంహెచ్‌వో డా.పద్మజ, డిసిహెచ్‌ఎస్ డా. సుజాతతో కలిసి ఎస్పీహెచ్‌వోల వారీగా కలెక్టర్ ఈడిడి క్యాలెండర్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ఎస్‌పిహెచ్‌వోలు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ముఖ్యంగా ఈ అంశాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధానంగా ఎస్‌పిహెచ్‌వోల వారీగా డెలివరి వివరాలను ఇకపై తానిచ్చిన ఫార్మెట్‌లో పొందుపర్చి పంపాలని, ఏరియా ఆసుపత్రులు, వైద్య విధాన ఆసుపత్రులు అన్న తేడా లేకుండా ప్రతి ఎస్‌పిహెచ్‌వో తన పరిధిలోని ప్రతి ఆసుపత్రిలో జరిగే ప్రసూతి వివరాలను సేకరించి, నిర్ణీత ఫార్మెట్‌లో అందజేయాలని ఆదేశించారు. తాను నిర్వహించే సమావేశాలకు ఒక్క ప్రొగ్రాం ఆఫీసర్ కూడా గైర్హాజరుకాకూడదని ఆమె ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక సిహెచ్‌సి పరిధిలో జరగబోయే ప్రసవాల సంఖ్య మేరకు ఆయా మహిళల వివరాలనను ట్రాక్ చేసేందుకు, కాస్త ముందుగానే ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి ఇవ్వాలన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గుతుందన్నారు.
జిల్లా పరిధిలోని 85 పిహెచ్‌సిలలో తొమ్మిది మాత్రమే 24 గంటలు పనిచేసే ఆసుపత్రులని, మిగిలిన 76 పిహెచ్‌సిల్లో తగినంత స్థలం, గదులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తనకు వివరాలను సమర్పించాలన్నారు. ఖాళీ స్థలమున్న వాటిని గుర్తించి, వాటిని అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్‌ఛార్జి జేసి నిఖిల మాట్లాడుతూ క్లస్టర్ స్థాయిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే ఆయా పథకాలు ప్రజలకు చేరుతాయన్నారు. ఎస్పీహెచ్‌వోల వారీగా కెసిఆర్ కిట్ల పంపిణీ వివరాలను తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీహెచ్‌వోలు వైద్యశాఖాధికారులు పాల్గొన్నారు.