హైదరాబాద్

కార్టూన్ ప్రపంచంలో రాలిన ధృవతార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 21: కార్టూనిస్టు మోహన్. ..కార్టూన్ ప్రపంచంలో ఆయన పేరు ఓ ప్రంభజనం. ఆయన ఇల్లు కళాకారులకు ఓ కాంపౌండ్. ఆయన గీసిన గీతల్లో ఎన్నో ఎనె్నన్నో భావాలు దాగి వుంటాయ. రాజకీయ నాయకులకు పంచ్ కొట్టాల ంటే మోహన్ కార్టూనే అన్నా అని అనుకోని కార్టూ నిస్టులు లేరు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ (66) కన్నుమూశారు. ఆ కుంచె ఆగిపోవడంతో కార్టూనిస్టులు కన్నీరు పెట్టారు. ఆయన గీత ఎన్నో ఉద్యమాలకు ప్రాణాలు పోసింది. ఆయన భౌతికకాయాన్ని గురువారం ప్రజల సందర్శనార్థం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు తీసుకువచ్చిన సందర్భంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు, జర్నలిస్టులు ఆయనకు నివాళులర్పించారు.

ముందస్తుగా జీతాలు.. ఉద్యోగుల హర్షం
* కమిషనర్‌ను కలిసిన ఔట్ సోర్స్ ఉద్యోగుల సంఘం నేతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 21: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి పర్మినెంటు ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సు ఉద్యోగులకు కూడా ఈ నెల 25న జీతాలు చెల్లించేందుకు సిద్దమైనందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఔట్ సోర్సు ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ నేతృత్వంలో కార్యదర్శి బాలనర్సింహారావు, కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఔట్ సోర్సు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ములుగు కిరణ్‌కుమార్ నేతృత్వంలో యూనియన్ నేతలు కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలను జిహెచ్‌ఎంసి మహిళా కార్మికులందరికీ అందజేయాలని కోరారు. జిహెచ్‌ఎంసి కార్మికుల్లో చాలా మందికి రేషన్‌కార్డుల్లేకున్నా, వారికి చీరలను అందించాలని కోరారు. అలాగే ఈఎఫ్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఏ, ఎస్‌ఆర్‌పి, సివోలకు పెట్రోలు అలవెన్సులు కూడా చెల్లించాలని కమిషనర్‌ను కోరారు.