హైదరాబాద్

శాఖల సమన్వయంతోనే విపత్తులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: వివిధ శాఖల మధ్య సమన్వయంతోనే ఎలాంటి విపత్తులకైనా చెక్ పెట్టవచ్చునని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నగరంలో ఇటీవల సంభవించిన అతి భారీ వర్షాలు వంటి పరిస్థితుల్లో అన్ని శాఖలను సమన్వయం చేసుకుని, పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షించటం వల్లే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తలేదని కూడా ఆయన వివరించారు. శనివారం నుంచి రెండురోజుల పాటు నగరంలో భారతీయ సైన్యం దక్షిణాది కమాండ్ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రళయ సహాయం’ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం కంటోనె్మంట్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీలో ‘వరదలు-సవాళ్లు’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 400 ఏళ్ల పై చిలుకు చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో అతి తక్కువ స్థాయిలో వర్షపు నీరు వెళ్లే కాలువ, అలాగే గంటకు రెండు సెంటీమీటర్ల వర్షపాత నమోదును తట్టుకునే స్థాయి గల వర్షపు నీటి డ్రెయిన్లున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో గంటకు 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఇంత భారీ వర్షం కురవటం వల్ల కలిగే ఉపద్రవాలు స్థాయిలో ఉంటాయో అంచనా వేసుకోవచ్చునన్నారు. అయితే జిహెచ్‌ఎంసితో పాటు విపత్తుల నివారణకు సంబంధించిన విభాగాలైన పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, విద్యత్ జలమండలి తదితరు శాఖలు అతి తక్కువ సమయంలో స్పందంచటం వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు చేపట్టగలిగామన్నారు. దీనికి కారణం ప్రస్తు వర్షాకాల సీజన్‌లో వివిధ విభాగాల ఉన్నుతాధికారులచే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమన్వయం సమావేశాలు నిర్వహించటమేనని వివరించారు. నగరంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో వాట్సప్ గ్రూప్‌లు రూపొందించటం జరిగిందని అన్నారు. దీంతో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న 30 సర్కిళ్లస్థాయిలో కూడా స్థానిక అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో 148 కాలనీలు, బస్తీలు భారీ వర్షాలకు నీటమునిగేవిగా గుర్తించామని, దీనికి కారణం ఈ కాలనీలు, బస్తీలు చెరువుల సమీపంలో, నాలాల వెంట నిర్మించారని వివరించారు. హైదరాబాద్ నగరంలో 831.43 కిలోమీటర్ల విడివిగల నాలాల్లో ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్ కన్నా ముందే పూడిక తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం నుంచి సంవత్సరం పొడువున ఈ పూడికతీత పనులను చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ పూడికలో 35 శాతం వ్యర్థాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు వస్తున్నాయని, ఇందుకు ప్రధాన కారణం నగరవాసులు చెత్తను నాలాల్లో వేయటమేనని ఆయన తెలిపారు. రిటైర్డు సైనికాధికారి జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న చెరువులు, కుంటలతో పాటు డ్రెయిన్ల దురాక్రమణలు సర్వసాధరణంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో చెన్నైలో వచ్చిన వరదలను ఆయన ప్రస్తావిస్తూ చెన్నై నగరంలో 125 చెరువులు, కుంటలు ఉండేవని, అవి ప్రస్తుతం 25కు తగ్గాయన్నారు. దేశంలో ఎక్కడ ఉపద్రవాలు జరిగినా పరిస్థితుల తీవ్రతను బట్టి సహాయం అందించేందుకు భారతీయ దళాలు సంసిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. సదస్సులో దక్షిణాది కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ పి.ఎం.హరీజ్ పాల్గొన్నారు.
వృథాగా ఉన్న బోరుబావుల పూడ్చివేయాలి
వేసవి వడగాలుల ద్వారా ఏర్పడే ఉపద్రవాల నివారణకై దేశంలో మొట్టమొదటి సారిగా ప్రత్యేక కార్యచరణను తయారు చేసిన రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. మన రాష్ట్రంలో 40శాతం మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉందని తెలిపారు.
ముఖ్యంగా నీరుపడని బోరుబావులను వృథాగా వదిలేయటం వల్ల వాటిల్లో చిన్నపిల్లలు పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని, ఈ విషయంలో బోరుబావులు వేయించిన యజమానులు వాటిని ఖచ్చితంగా పూడివేసేందుకు వీలుగా కఠిన నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు.