హైదరాబాద్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య ప్రాజెక్టు మెట్రోరైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాభాగస్వామ్యం కల్గిన అరుదైన ప్రాజెక్టు మెట్రోరైలు అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి అభివర్ణించారు. ఆఫ్రియా, దక్షిణాసియాలోని ఈజిప్టు, ఇతియోపియ, భూటాన్, కంబోడియా, నేపాల్, జమైకా, ఫిజి, క్రోషియా, శ్రీలంక, ఆంగోల, ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, గనా, సౌతాఫ్రిక తదితర 28 దేశాలకు చెందిన బృందం శుక్రవారం బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌ను సందర్శించింది. ఈ మేరకు ఎండి ఎన్వీఎస్ రెడ్డి వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హైదరాబాద్ మెట్రోరైలు ప్రతిపాదనల స్థాయి నుంచి నేడు క్షేత్ర స్థాయిలో జోరుగా పనులు సాగేందుకు కారణమైన అనేక ప్రయోగాలు, పరిశోధనలను వారికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక, ఇంజనీరింగ్ నైపుణ్యత, భూ సేకరణ వంటి అంశాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎదురైన సవాళ్లను తాము అధిగమించిన తీరును తెలియజేశారు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మహాపట్టణాలకు చక్కటి ప్రాజెక్టు మెట్రోరైలు అని వివరించారు.వెల్లడించారు. మెట్రోరైలు ప్రాజెక్టు అనేది పీపుల్స్, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విజన్, వ్యూహాం, రవాణా, స్మార్ట్ టికెటింగ్, ప్రయాణికుల భద్రత, పాదచారుల కోసం ఏర్పాటు చేయనున్న సైడ్‌వాక్ వంటి వౌలిక వసతుల గురించి వివరించారు. అంతేగాక, కేవలం మెట్రో స్టేషన్ నుంచి మరో స్టేషన్ వరకు మెట్రో ప్రయాణమే గాక, మెట్రో స్టేషన్‌కు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు సరైన వేళలకు స్టేషన్ చేరుకునేందుకు కాలుష్య రహిత ఫీడర్ వాహనాలను కూడా నడుపనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో ప్రతిపాదనల స్థాయి నుంచే మహిళలు, చిన్నారులు, సీనియర్ సిటిజనులు, వికలాంగులకు కల్పించాల్సిన సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెట్రోరైలు జనరల్ మేనేజర్(వర్క్స్) బిఎన్ రాజేశ్వర్, జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) సూర్యప్రకాశం, అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ జె. స్వర్ణలత పాల్గొన్నారు.

బతుకమ్మను ఎత్తుకున్న కలెక్టర్ రాణా
* కలెక్టరేట్‌లో ఘనంగా సంబురాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని కలెక్టర్ యోగితారాణా అన్నారు. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఎంతో ఆనందంగా జరుపుకునే గొప్ప పండుగ అని వర్ణించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ పాల్గొని బతుకమ్మను ఎత్తుకుని ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రస్తుతం బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో పలు రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. బాలికలందరూ కూడా బాగా చదువుకుని ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఆ కుటుంబంలోని అన్నదమ్ములు, తండ్రి, పెళ్లైన తర్వాత భర్త పూర్తిగా సహకరించినపుడే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు అవకాశముంటుందని వివరించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ బతుకమ్మ సంబరాల్లో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నిఖిల, ఇన్‌చార్జి డిఆర్వో సరళావందనం, ఆర్డీవో చంద్రకళ, లా ఆఫీసర్ సంగీత, మహిళ శిశు అభివృద్ధి అధికారి సునంద, ఇన్‌చార్జి ఏవో రాధికారమణి, సిపివో బలరాం, టిజిఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఎన్జీవో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ముజీబ్,నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సదానంద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా టిఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ సందీప్ ఆధ్వర్యంలో ఆలపించిన బతుకమ్మ పాటలు, స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ శ్రీ వత్సకోట ఆలపించిన మీరా భజన కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.