హైదరాబాద్

ఆద్యంతం..ఉత్కంఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: విపత్తులు, విపత్కర పరిస్థితులు సంభవించినపుడు అందులో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలను కళ్లకద్దినట్లు ప్రదర్శించాయి త్రివిధ దళాల సైన్యం, జాతీయ విపత్తుల నివారణ బృందాలు.ప్రళయసహాయం పేరిట భారతీయ సైనిక దళం విభాగం ఆధ్వర్యంలో శనివారం హుస్సేన్‌సాగర్‌లో నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌లోని సాహస విన్యాసాలు ఆద్యంత ఉత్కంఠతో కొనసాగాయి. నీటిలో చిక్కుకుపోయిన వారిని ఆదుకునేందుకు అప్పటికపుడు సమస్పూర్తితో స్పందించి సైన్యం చేపట్టే చర్యలను కొందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ మాక్‌డ్రిల్‌ను తిలకించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి సుభాష్ బామ్రే హాజరయ్యారు. భారీ వరదల సందర్భంగా నీట మునిగే కాలనీలు సహాయం కోసం బాధితులు చేసే ఆక్రందనలు, మునిగిన వాహనాలతో కూడిన సెట్టింగ్‌లను హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేశారు. సహజసిద్దంగా ముంపు కాలనీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ రక్షణ దళాలకు చెందిన హెలిక్యాప్టర్, బోట్‌ల ద్వారా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేయటం, వారికి ఆహార పదార్థాలను జారివిచటం, కావల్సిన మందులు పంపిణీ చేసే తీరు తదితర అంశాలను కళ్లకట్టినట్లుగా అద్భుత విన్యాసాలను శనివారం ఉదయం ప్రదర్శించారు. భారీ వరదలు సంభవించి, అందులో చిక్కుకుపోయిన బాధితులను ఎలా కాపాడాలనే దానిపై సైనికులు, ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. దీని కోసం హుస్సేన్‌సాగర్‌లో మునిగిపోయిన ఇళ్లు, భవనాలు, విద్యా సంస్థలు వంటి వాటి నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాల్లో ప్రజలు చిక్కుకున్నట్లు కేకలు వేస్తూ కన్పించారు. వారిని సైనికులు స్పీడ్ బోటు సహాయంతో రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో పాటు హెలికాప్టర్ నుంచి సైన్యం సాగర్‌లోకి తాడు సహాయంతో దిగి, అక్కడి నుంచి పడవల ద్వారా నీట మునిగిన భవనాల వద్దకు చేరుకుని, అందులో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే విన్యాసాం వాస్తవానికి దగ్గరగా కొనసాగింది. ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్‌ను రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బామ్రే, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తదితరులు తిలకించారు.
ఆ తర్వాత పీపుల్స్ ప్లాజాలో విపత్తుల నివారణలో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు చెందిన పలు విభాగాలు, ఫ్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనకు సైతం విశేష స్పందన వచ్చింది.