హైదరాబాద్

జలమండలిలో కొత్త సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: జంట నగరవాసుల దాహర్తిని తీర్చే జలమండలిలో సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఎట్టకేలకు ఎండి దాన కిషోర్ నిర్ణయించారు. ఏ ఏ విభాగంలో ఎలాంటి మార్పులు, సంస్కరణలు తీసుకురావాలనే అంశంపై అధికారులతో రెండురోజుల పాటు నిర్వహించిన మేధోమథన సదస్సు శనివారంతోముగిసింది. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ డా.పి.ఎస్.సూర్యనారాయణ, ప్రాజెక్టు-1 డైరెక్టర్ ఎం.ఎల్లాస్వామి, ప్రాజెక్టు-2 డి. శ్రీ్ధర్‌బాబు, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.
సంస్కరణలివీ..
* వివిధ క్యాటగిరీలో ఇస్తున్న నూతన నల్లా కనెక్షభ్లను మరింత తక్వుక సమయంలో అందించాలని నిర్ణయించారు. * గ్రీన్ బిగ్రేడ్ కాంట్రాక్టర్లు నూతన నల్లా కనెక్షన్లు ఇచ్చేటపుడు తప్పనిసరిగా అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎస్‌ఎల్‌ఏ లోపల నూతన కనెక్షన్ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్న కొత్త సంస్కరణను తెరపైకి తెచ్చారు. * ప్రతి సబ్ డివిజన్‌లో ఒక కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలి, అందులో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా వినియోగదారులకు సూచనలు ఇవ్వటం, నూతన కనెక్షన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవటం వంటి అంశాల్లో సహకరించాలి,. మంచినీటి సరఫరా, మురుగునీటి ఫిర్యాదుల వివరాలను సేకరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలి.* ప్రస్తుతమున్న బిల్లింగ్ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి* ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీటిని సరఫరా చేస్తున్న బస్తీలకు పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే క్రమేణా ఉచిత ట్యాంకర్లను తగ్గించే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. * రీసెర్చ్ అండ్ అనలైజ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి* హాడ్కో ప్రాజెక్టులోని 56 రిజర్వాయర్లను ఆటోమేషన్ పద్దతిలో పర్యవేక్షించేలా చర్యలను చేపట్టాలి.* స్కాడా(ఎస్సీడిఏ)ను బలపరిచి జలమండలికి ఉన్న అన్ని నీటి వనరుల సమగ్ర వివరాలు ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్న మాస్టర్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలి. * విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలను చేపట్టాలని ఎండి నిర్ణయించారు. సాధ్యమైనన్ని ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా మంచినీటిని సరఫరా చేయటం, అంతేగాక, సొలార్ విద్యుత్‌ను వినియోగించి భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకోవాలి.
ప్రవర్తించే తీరులో మార్పు రావాలి
జలమండలిలో ప్రవేశపెట్టాల్సిన కొత్త సంస్కరణలపై రెండురోజు పాటు అధికారులకు సదస్సు నిర్వహించిన ఎండి దాన కిషోర్ పలు కొత్త సంస్కరణలను ప్రకటించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన, తృప్తికరమైన సేవలను అందించేందుకు సాధ్యమైన వినూత్న ఆలోచనలను సూచించాలని ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ అధికారులకు సూచించారు. జలమండలి రోజు చేపట్టే నీటి సరఫరా నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, వాల్వుల నిర్వహణ వంటి అంశాల్లో కూడా ప్రస్తుతం అనుసరిస్తున్న పద్దతులకన్నా కాస్త మెరుగైన పద్దతులు రావాలన్నారు.
సదస్సు అనంతరం వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామంటూ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.