హైదరాబాద్

కోర్టు తీర్పు వచ్చిన వివాదాస్పద భూములను డీ మార్కింగ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రభుత్వ భూములకు సంబంధించి నడుస్తున్న కేసుల్లో కోర్టు తీర్పులు వచ్చిన భూములను డీ మార్కింగ్ చేసి, అందుల్లో అది ప్రభుత్వ భూమి అన్న బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె భూములకు సంబంధించిన కోర్టు కేసులు, ల్యాండ్ బ్యాంక్, ఎన్‌ఐసి డేటా అప్‌డేట్, మీ సేవా సర్ట్ఫికెట్ల జారీ, ఆర్‌ఆర్ కేసులు తదితర అంశాలపై ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నిఖిల, ఇన్‌చార్జి డిఆర్వో సరళావందనంతో కలిసి తహశీల్దార్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బోర్డులను ఏర్పాటు చేసిన భూముల వివరాలను వెంటనే ల్యాండ్ బ్యాంక్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఆయా స్థలాల పరిరక్షణకై విఆర్వోలు ప్రతి రోజు తనిఖీలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించారు. అంతేగాక, రెగ్యులరైజేషన్, ఎన్‌వోసిల కింద తిరస్కరించిన భూముల వివరాలను కూడా ల్యాండ్ బ్యాంక్‌లో చేర్చాలని సూచించారు. గతంలో జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారిలో తిరిగి ఎంత మంది జివో 58, జీవో 59ల కింద దరఖాస్తు చేసుకున్న జాబితాను అందజేయాలని ఆదేవించారు. ఎన్‌వోసి ప్రతిపాదనలకు త్వరలోనే ఒక చెక్ లిస్టును పంపడం జరుగుతుందని, ఆ లిస్టును అనుసరించి అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించి తహసిల్దారు సెల్ఫ్ సర్ట్ఫికేషన్‌తో ఇకపై ఎన్‌వోసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కోర్టులో కేసులకు సంబంధించి కౌంటర్ ఫైల్ చేయాల్సిన కేసులు వివరాలను మండలాల వీరాగా సమీక్షిస్తూ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి మొత్తం 75 కేసులున్నాయని, వీటన్నింటికి 15 రోజుల్లోగా కౌంటర్లు తయారు చేసి పంపాలని ఆదేశించారు. జిపి వద్ద కౌంటర్లు పెండింగ్‌లో ఉన్న పక్షంలో సంబంధిత తహసిల్దార్లు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని వాటిని ఆమోదింపజేసుకోవాలన్నారు. ఎవరెవరికి ప్రభుత్వ భూములు కేటాయించామో, ప్రస్తుతం వాటి స్టేటస్ ఎలా ఉందోనన్న వివరాలతో మండలాల వారీగా నివేదికలను రూపొందించిన పంపాలన్నారు. ఆయా శాఖలు ఇచ్చిన భూములను ఇప్పటిక వరకు వినియోగించుకోకపోతే వాటిని తక్షణమే ఇంకెవరికైనా కేటాయించేందుకు అవకాశముందా? అన్న వివరాలను కూడా పంపాలన్నారు. ధిక్కార కేసులకు సంబందించిన సమాచారాన్ని వెంటనే లా ఆఫీసర్‌కు తెలియజేసి నిర్ణీత వ్యవధిలోపు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపడితే అట్టి వివరాలను కూడా పంపాలని ఆదేశించారు. ఎన్‌ఐసి అప్‌గ్రేడేషన్‌పై సమీక్షిస్తూ 2013 సంవత్సరం నంచి కోర్టు కేసులకు సబంధించిన డేటా అప్‌డేట్ చేయాలని ఆదేవించారు. తహశీల్దార్ల నుంచి కేసుల వివరాలను సేకరించి ఎప్పటికపుడు డేటాను అప్‌డేట్ చేయాలని ఎన్‌ఐసి అధికారి భద్రయ్యను ఆదేశించారు. ఈ సమావేశంలో లా ఆఫీసర్ సంగీత, ఆర్డీవో చంద్రకళ, ఇన్‌చార్జి ఏవో రాధికరమణి, తహశీల్దార్లు పాల్గొన్నారు.
పిటిషన్ ఏదైనా వారంలోగా పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పిటిషన్లు ఏవైనా వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. సమీక్షలో భాగంగా ఆమె ‘మీ కోసం’ కార్యక్రమానికి వచ్చిన పిటిషన్లపై ఆమె సమీక్షిస్తూ కారుణ్య నియామకాలు, అపద్బంధు స్కీంకు సంబంధించిన పిటిషన్లను సుమోటోగా తీసుకుని పరిష్కరించేందుకై చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఆర్‌ఆర్ చట్టం కింద ప్రాపర్టీ అటాచ్‌మెంట్‌కు సంబంధించి మొత్తం 481 కేసులున్నాయని, వీటన్నింటిని అప్‌డేట్ చేసి, చిన్నచిన్న కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగు కార్యచరణను ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.