హైదరాబాద్

శ్రీకాంత్ ఇంట్లో కార్లు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: నటుడు శ్రీకాంత్ ఇంట్లోకి అక్రమంగా చొరబడి కార్లను ధ్వంసం చేసిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే వెంకటేష్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 76లోని నటుడు శ్రీకాంత్ ఇంట్లో గతంలో వంట మనిషిగా పనిచేశాడు. ఇతని పని నచ్చక పోవడంతో వెంకటేష్‌ను విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి తరుచూ శ్రీకాంత్ ఇంటి వద్దకు వస్తున్న వెంకటేష్‌ను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోసాగారు. దీంతో ఎలాగైనా ఇంట్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న వెంకటేష్ సెక్యూరిటీ సిబ్బందికి శ్రీకాంత్ సార్ నన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారని తప్పుడు సమాచారం అందించి ఇంట్లోకి ప్రవేశించాడు. లోనికి వెళ్తూనే కార్లను ధ్వంసం చేసుకుంటూ వెళ్లసాగాడు. అనంతరం నేరుగా శ్రీకాంత్ ఉన్న గదిలోకి వెళ్లి అతనిపై దాడికి యత్నించారు. అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన లోనికి వెళ్లి అతన్ని అడ్డగించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం కార్లను ధ్వంసం చేసిన కేసును అతనిపై నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు వెంకటేష్‌ను విచారిస్తున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

25న పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్

హైదరాబాద్, సెప్టెంబర్ 23: 25వ తేదీ సోమవారం నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గోదావరి తాగునీటి ప్రాజెక్టుకు నిర్వహణపరమైన మరమ్మతులు చేపడుతున్న కారణంగా పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండకపోవచ్చునని మండలి వెల్లడించింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని కొంత భాగం, జగద్గిరిగుట్ట, చింతల్, ఆదర్శ్‌నగర్, ఆల్విన్‌కాలనీలో కొంతభాగం, వెంకటేశ్వరనగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండబోదని జలమండలి పేర్కొంది. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు అంతకు ముందు వచ్చే సరఫరాలో తమకు అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, సహకరించాలని జలమండలి కోరింది.