హైదరాబాద్

భూగర్భజలాల కాలుష్యానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శివార్లలోని జవహర్‌నగర్ చెత్త డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కలుషిత నీటి సరఫరాకు చెక్ పెట్టేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమైంది. భూగర్భ జలాలు సైతం తీవ్ర స్థాయిలో కలుషితం కావటం, అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు సైతం ప్రభుత్వం, జిహెచ్‌ఎంసిపై ఒత్తిడి తేవటంతో ఎట్టకేలకు జిహెచ్‌ఎంసి పరిష్కారాన్ని కనుగోంది. సుమారు 24 ఏళ్ల నుంచి ఇక్కడే చెత్త వేస్తున్నందున సుమారు అరవై అడుగుల ఎత్తు వరకు పేరుకుపోతున్న చెత్త కుప్పలు, పైగా వర్షం కురిసినపుడు అది బాగా నానటంతో ఈ చెత్త నీరు కిందకు ప్రవహించి, భూమిలోకి ఇంకిపోవటం వల్లే భూగర్భ జలాలు కలుషితమై జవహర్‌నగర్ పరిసరప్రాంతాలైన 18 గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమైనట్లు గుర్తించారు. ఇందులో ఐదు గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు జిహెచ్‌ఎంసి గుర్తించింది. ఇందుకు గాను తొలుత చెత్త కుప్పల్లో నుంచి కారే మురుగు నీటిని శుద్ధి చేయగలిగితే ఈ సమస్య కొంత వరకు పరిష్కరించవచ్చునని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. ఈ ప్రక్రియను వినియోగిస్తూ ప్రస్తుతం పూణే మున్సిపల్ కార్పొరేషన్ చక్కటి ఫలితాలను సాధిస్తోంది. ఇదివరకే పూణే అధికారులతో సమాచలోనలు జరిపిన జిహెచ్‌ఎంసి అధికారులు డంపింగ్ యార్డుల్లో ఆ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ట్రీట్‌మెంట్ ప్లాంటును కూడా ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించగా, రోచెమ్ అనే కంపెనీకి ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రెండు రకాల యూనిట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొదటి యూనిట్‌లో ఆధునిక యంత్రాల ద్వారా మురుగునీరు 55 శాతం శుద్ధి కాగా, రెండో యూనిట్‌లో మిగిలిన 45 శాతం పూర్తవుతోంది. ఇందుకు గాను యుకె నుంచి ప్రత్యేకంగా నిపుణులు సైతం రానున్నారు. ఈ ప్రక్రియను కాలుష్య నియంత్రణ మండలి, ఇపిటిఆర్‌ఐలు పర్యవేక్షించనున్నాయి. తొలుత జవహర్‌నగర్ డంపింగ్ యార్డుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టి, తద్వారా వచ్చే ఫలితాల ప్రకారం ఇతర ప్రాంతాల్లో చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలకు సంబంధించి ఒప్పందం చేసుకుని, పనులు చేపడుతున్న రాంకీ ఎన్విరో ఈ మురుగునీటి శుద్ధిని చేపట్టనుంది. ఇందుకయ్యే వ్యయంలో జిహెచ్‌ఎంసి 35శాతం, మిగిలిన 65 శాతం రాంకీ భరించనున్నట్లు తెలిసింది. ఇందుకు కేంద్రం రూ. 40 కోట్లు మంజూరు చేసినా, ఇంకా నిధులు విడుదల కాలేదు. కానీ ఇప్పటికే రాంకీ చెత్త కుప్పలపై ఆయపింగ్‌ను ప్రారంభించింది.
శుద్ధి చేసిన నీటి ప్రత్యామ్నాయ వినియోగం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పల నుంచి కారే నీటిని శుద్ధ చేసిన తర్వాత దాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించే మార్గాలను కూడా జిహెచ్‌ఎంసి అనే్వషించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మురుగునీటిలో సుమారు 70 శాతం శుద్ధి చేసిన వాటిని వ్యవసాయానికి, భవన నిర్మాణ రంగం అవసరాలకు వినియోగించుకునే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భూమిలోకి ఇంకకుండా..
చెత్త కుప్పలపై శాస్ర్తియ విధానంతో పై నుంచి కిందకు పొరలుపొరలుగా తొలుత క్యాపింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల చెత్త కుప్పల్లోని మురుగునీరు భూమిలోకి ఇంకకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే వచ్చే వర్షాకాలంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు చెత్తకు పూర్తి తరహాలో క్యాపింగ్ చేసిన తర్వాత మురుగునీటి శుద్ధి ప్రక్రియ చేపడితే డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాల కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు.