హైదరాబాద్

నగర వ్యాప్తంగా ఎల్‌ఇడి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 24: మహానగరం ఎల్‌ఇడి వెలుగులతో మరింత అందంగా కనిపించనుంది. విద్యుత్ వినియోగాన్ని భారీ తగ్గించుకునే చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఈ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంత కాలంగా ఈ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొదట పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి పెట్టిన అధికారులు అనంతరం ప్రధాన రహదారుల్లో వీటిని అమర్చారు. ప్రస్తుతం కాలనీలు, బస్తీల్లోకి వీధి దీపాలను తొలగించి అత్యాధునిక పద్దతిలో రూపొందించిన ఎల్ ఇడి బల్బులను అమర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆదాపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించిన నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు ప్రారంభించింది. మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని అమలుచేసి, అనంతరం అన్ని డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిహెచ్‌ఎంసి పరిధిలో విద్యుత్ భారీగా ఆదా కానుంది. ఆ మేరకు మహానగర పాలక మండలిపై విద్యుత్ భారం తగ్గనుంది. కేవలం విద్యుత్ ఆదానే కాకుండా ఎల్‌ఇడి లైట్లు సాంప్రదాయ లైట్లకంటే ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు వివరిస్తున్నారు.