హైదరాబాద్

శిథిలావస్థలో రెవెన్యూ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 24: భూ రికార్డులను ప్రక్షాలన చేసి భూ యాజమాన్య హక్కులపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాల సర్వే నంబర్లతో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ బృందాలు వివాద రికార్డులను పరిశీలించి ఎలాంటి వివాదాలకు దారి తీయని రికార్డులను రైతుల సమక్షంలో పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. కానీ కొన్ని రికార్డులు మాత్రం తహశీల్దార్ కార్యాలయాల్లో కనిపించడం లేదు. భూ యాజమాన్యత్వం హక్కులకు సంబంధించిన కీలకమైన రికార్డులు మాత్రం చాలావరకు అస్తవ్యస్తంగా తయారయ్యాయ. రికార్డులు చిరిగిపోయి, కొన్ని రికార్డులు కనిపించకపోవడం అధికారులకు సమస్యలుగా మారుతున్నాయి. ఇలాంటి వివాద స్థల రికార్డుల జోలికి పోకుండా స్పష్టంగా ఉన్న రికార్డులను మాత్రమే భూసర్వే పరిశీలించే బృందాలు పరిశీలిస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో భూ యాజమాన్యత్వానికి సంబంధించిన కీలకమైన రికార్డులు నిజాం కాలం హయాంలోనివని, ఆ రికార్డులు చాలా వరకు చిరిగిపోవడంతో స్పష్టంగా రికార్డులను అధికారులు తేల్చలేకపోతున్నారు. పహాణీ, కాస్రా పహాణీ, ఆర్‌ఒఆర్, రక్షత కౌలుదారు, భూ సంస్కరణలకు సంబంధించిన రికార్డులు చెసాల, పైసల పట్టీ, వసూలు బాకీ, విరాసత్ వంటి కీలకమైన రికార్డులు రెవెన్యూ కార్యాలయాల్లో సక్రమంగా లేవు. నైజాం కాలంలో ఉన్న రికార్డులు చినిగిపోయాయి. ఉన్న వాటిలో ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం భూ సర్వే బృందాలు గ్రామాలలో పర్యటించి స్పష్టంగా ఉన్న రికార్డులు పరిశీలించి 1బి, ఆర్‌ఓఆర్ రైతులకు అందజేసి వాటిలో ఏమెనా స్వల్పంగా వివాదాలు ఉన్నట్లైతే గ్రామాల్లోనే అక్కడికక్కడే విచారించి పరిష్కరిస్తున్నారు. రికార్డులు సక్రమంగా లేని వాటి జోలికి పోవడం లేదు. ప్రస్తుతం ఉన్న రికార్డులను ఉన్నతాధికారులకు తెలియజేసి ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే రిపోర్టు అందజేస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, జిల్లెడ్ చౌదరిగూడ, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట మండలాల పరిధి గ్రామాల్లో వ్యవసాయ పొలాల ధరలు విపరీతంగా ఉండడమే కాకుండా ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం, హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి నూతనంగా నాలుగు లైన్ల రహదారిగా మార్చడం వల్ల ఈ ప్రాంతంలోని వ్యవసాయ పొలాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జాతీయ రహదారి ఇరువైపులా ఎకరానికి 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఉన్న మార్కెట్ ధరలు ప్రస్తుతం కోటి నుండి రెండు కోట్ల వరకు ఎకరానికి క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ పొలాల రికార్డుల్లో తీవ్రంగా అవకతవకలు ఉండడం వల్ల వివాదాలకు దారితీస్తోంది. షాద్‌నగర్ తహశీల్దార్ కార్యాలయంలో చటాన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 695, 696 వ్యవసాయ పొలానికి సంబంధించిన 1973-74 సంవత్సరం పహాణి ఇవ్వాల్సిందిగా చటాన్‌పల్లి గ్రామానికి చెందిన పి.యాదయ్య దరఖాస్తు చేసుకున్నాడు. షాద్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది రికార్డులను పరిశీలించి చటాన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 695, 696 వ్యవసాయ పొలానికి సంబంధించిన 1973-74 పహాణి గురించి తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలించగా ‘దీనికి సంబంధించిన రిజిస్టర్ శిథిలావస్థలో ఉన్నందున మీరు కోరిన నకళ్లు ఇచ్చేందుకు వీలు పడదని తెలుపనైనది’ అని ఫైల్ నంబర్ 944/2017 తేది 16-9-2017 రోజు తహశీల్దార్ కార్యాలయం రాత పూర్వకంగా తెలిపారు. ఇలాంటి కీలకమైన రికార్డులు రెవెన్యూ కార్యాలయాల్లో కనిపించడం లేదని చటాన్‌పల్లి, సోలీపూర్, కొందుర్గు, ఎలికట్ట, చించోడ్, రాయికల్, మొగిలిగిద్ద, కేశంపేట వంటి గ్రామాలలో రైతుల రికార్డులు సక్రమంగా లేదని అనేక మంది రైతులు తెలుపుతున్నారు. ప్రస్తుతం భూ సర్వే అధికారులు మాత్రం వివాదామైన వాటికి మాత్రం ఱలాంటి జవాబు ఇవ్వడం లేదు. ఇటువంటి కీలకమైన రికార్డులు లేని భూ వివాద కేసులు తహశీల్దార్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల్లో పరిష్కారం కొరకు పెండింగ్‌లో లక్షలాది పిటిషన్లు ఉన్నాయి. మరికొంతమంది జ్యుడీషియల్ న్యాయస్థానాల్లో వివాదామైన భూముల యజమాన్యత్వం కోసం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం భూ సర్వే బృందాలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్న వాస్తవాలను పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందజేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

భారత్ గ్యాస్ గోదాంలో చోరీ

* 238 సీలిండర్లను దొంగలించిన గుర్తుతెలియని వ్యక్తులు
* అర్థరాత్రి లారీలో లోడ్ చేసుకొని పారిపోయిన వైనం
షాబాద్, సెప్టెంబర్ 24: షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామ శివారులోని శ్రీలక్ష్మీ శ్రీనివాస గ్యాస్ గోదాములో శనివారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. ఉదయం ఎనిమిది గంటలకు సమాచారం తెలుసుకున్న షాబాద్ ఎస్సై రవికుమార్, చేవెళ్ల సిఐ గురువయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చేవెళ్ల ఎసిపి ఉషా విశ్వనాథ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించి క్లూస్ టీం అధికారులను పలిపించి వివరాలు సేకరించారు. ముంబాయి - బెంగళూరు లింక్ రహదారి పక్కనే ఉన్న గ్యాస్ గోదాములో నుండి లారీలో సిలిండర్లు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఎపుడు రద్దీగా ఉండే ప్రాంత నుండి లారీలో 238 సిలిండర్లు తీసుకెళ్లడం పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గోదాము గేటుకు, మధ్యలోని ప్రహరీకు, సీలిండర్లు నిల్వ ఉంచిన గదికి వేసిన మూడు తాళాలను తీసి దొంగిలించారు. ఆదివారం ఉదయం గోదాముకు వెళ్లిన నిర్వాకుడు శ్రీనివాస్ రెడ్డి.. తెరిచి ఉన్న గేట్లును చూసి చోరీ జరిగిందని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీస్ అధికారులు వచ్చి దర్యప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో మహారాష్టక్రు చెందిన వాటర్ బాటిల్‌తో పాటు రైల్ టికెట్ లభించినట్లు ఎసిపి పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల క్రితం భారత్ గ్యాస్ గోదాములో ఇలానే దుండగులు గ్యాస్ సిలిండర్లు దొంగించారు.
షాబాద్‌లో జరిగిన దొంగతనం ఒకరే చేశారా అనే కోణంలో దరాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వివరించారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస గ్యాస్ నిర్వకుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.