హైదరాబాద్

అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, అక్టోబర్ 10: సనత్‌నగర్ నియోజకవర్గంలో భారీ వ్యయం తో నిర్వహించనున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈనెల 19న ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయాలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కెటిఆర్ వస్తున్నందున కార్యకర్తలు, నాయకులు, లబ్దిదారులు అధికంగా పాల్గొనేలా చూడాలని వారికి సూచించారు. ఎస్సార్‌నగర్‌లో 3.78 లక్షలతో నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడంతో పాటు మారెడ్‌పల్లిలో నిర్మాణం పూర్తిచేసుకున్న మంచినీటి రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో కొర్పొరేటర్లు శేషుకుమారి, కొలను లక్ష్మిబాల్‌రెడ్డి, ఆకుల రూప, ఉప్పల తరుణి, హేమలత, శ్రీనివాస్‌గౌడ్, నరేందర్‌రావు, సురేష్, అఖిల్, శ్రీహరి, కమల్‌కుమార్ పాల్గొన్నారు.
ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం
నియోజకవర్గంలో ఈనెల 19న అభివృద్ధి పనులను ప్రారంభనున్న నేపధ్యంలో మంత్రి తలసాని తన చాంబర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జానార్దన్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండి ఎన్‌వి ఎస్ రెడ్డి, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నిఖిల, జిహెచ్‌ఎంసి సిఈ జయావుద్దీన్, ఎస్‌ఈ మోహన్‌సింగ్, వాటర్ వర్క్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణ, మెట్రోరైల్ సిఈ రాజేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ శ్రీ్ధర్, జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ శైలజ, ఆర్టిఓ చంద్రకళ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ, ఈనెల 19న నియోజక వర్గంలో మొత్తం 14 పనులకు శంకుస్థాననలు నిర్వహించనున్నామని చెప్పారు. ఎస్సార్‌నగర్‌లో ఆసుపత్రి నిర్మాణానికి, ఆదయ్యనగర్‌లో నూతన లైబ్రరీ నిర్మాణం, స్పార్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట డివిజన్‌లోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఫత్తేనగర్ బ్రిడ్డి వరకు హైదరాబాద్ రోడ్డు డవలప్‌మెంట్ ఆధారిటి ఆధ్వర్యంలో చేపట్టనున్న మోడల్ రోడ్డు నిర్మాణం, మినిస్టర్స్ రోడ్డులో బిటి రోడ్డు నిర్మాణ పనులు, సత్యం థియేటర్ వద్ద నాలాపై శ్లాబ్ నిర్మాణం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంవద్ద మెట్రోరైల్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణ పనులకు మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపనులు చేస్తారని చెప్పారు.