హైదరాబాద్

యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 10: గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యదాస్థితికి తీసుకువచ్చేందుకు జిహెచ్‌ఎంసి నడుం బిగించింది. భారీ గుంతలు, కోతలకు గురైన రోడ్లకు యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేసేందుకు రూ. 91 కోట్లు కేటాయించారు. వర్షాలకు చిన్న, చితక రోడ్లతోపాటు ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండగా, పాదచారులు సైతం భయం, భయంగా నడవాల్సి వస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని వర్షాలు తగ్గిన వెనువెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. జోన్లవారీగా దెబ్బతిన్న రోడ్ల వివరాలను సేకరించిన ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని బట్టి టెండర్లను సిద్దం చేశారు. రెండు, మూడు రోజుల్లో టెండర్లను పూర్తిచేసి క్షేత్రస్థాయిలో రోడ్ల నిర్మాణాలపై దృష్టి సారించనున్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రతీ రోడ్డు వివరాలను సేకరించి రోడ్ హిస్టరీని రూపొందించనున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో నిక్షిప్తం చేయనున్నారు.