హైదరాబాద్

మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 10: పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నారని ఈ నేపధ్యంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. మంగళవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడాలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి దేవిప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్‌తో కలిసి మాట్లాడుతూ పట్టణీకరణ, క్షణం తీరికలేకుండా పోవడం వంటి కారణాలతో చిన్న, పెద్దా అని తేడా లేకుండా అందరూ మానసిక ఒత్తిళ్లకు గురికావాల్సి వస్తుందన్నారు. మార్కులు, ర్యాంకుల వేట మొదలైనప్పటి నుంచి విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. శరీరానికి వచ్చే ఆనారోగ్య సమస్యల్లో 90 శాతం మానసిక ప్రశాంతత లేకపోవడం వల్లేనని నివేదికలు వెల్లడిస్తున్న నేపధ్యంలో రేపటి భావి భారత పౌరులకు మానసిక ప్రశాంతత ఎలా పొందాలో వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
నగరంలోని 60 కాలేజీల్లో తమ అసోసియేషన్ సైకాలజిస్టులచే లక్ష మంది విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నట్టు రాంచందర్ తెలిపారు.