హైదరాబాద్

సిటీకి వర్షం జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: మహానగరానికి వర్షం జ్వరం పట్టుకుంది. ఈ వర్షాకాల సీజన్‌లో ఇప్పటికే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైన సంగత తెలిసిందే! కొద్దిరోజుల క్రితం దాదాపు ఐదు గంటల పాటు కురిసిన వర్షం సృష్టించిన భీభత్సం నుంచి నగరం ఇంకా కోలుకోకముందే గురువారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల గంటల 15 నిమిషాల వరకు దాదాపు గంట సేపు కుంభవృష్టి వర్షం కురిసింది. అంతకు ముందు మధ్యాహ్నాం రెండున్నర గంటల నుంచి దాదాపు మూడు గంటల వరకు అరగంట సేపుటౌలీచౌకీ, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంతేగాక, గడిచిన కొద్దిరోజులుగా నగరంలోని వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నాం మూడు, నాలుగు గంటల వరకు ఎండలు విపరీతంగా కొడుతూ ఉక్కపోతతో జనం అల్లాడిపోతుండగా, సాయంత్రం, తెల్లవారుఝము సమయంలో భారీ జల్లులు కురుస్తున్నాయి. అంతేగాక, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోత, రాత్రికి చలి వేయటంతో నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం పలు సార్లు కుండపోతగా కురిసిన వర్షం ఫలితంగా లోతట్టుప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు కూడా చేరింది. అంతేగాక, వాహనాల రాకపోకలతో కిటకిటలాడే ప్రధాన రహదార్లలో మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలిచింది. వర్షం కురుస్తున్న దాదాపు గంట సేపే గాక, ఆ తర్వాత కూడా గంటల కొద్ది లోయర్ ట్యాంక్‌బండ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌లలో ట్రాఫిక్ తీవ్ర స్థాయిలో అంతరాయమేర్పడటంతో ఆర్టీసి బస్సులు రూటు మార్చి రాకపోకలు సాగించాయి. చార్మినార్ నుంచి సికిందరాబాద్‌కు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను తీసుకువచ్చే 8ఏ నెంబర్ బస్సు కూడా రాత్రి ఏడు గంటల నుంచి రూటు మార్చి ప్రయాణం సాగించింది. ముఖ్యంగా చినుకుపడితే చాలు మహావీర్ ఆస్పత్రి బస్టాపు, హోటల్ వుడ్‌లాండ్ ముందున్న రహదారితో పాటు, రాణిగంజ్ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఓ క్లబ్ ముందు రహదార్లు చెరువులను తలపించాయి. అలాగే ఎం.జె.మార్కెట్ చౌరస్తా, లక్డీకాపూల్ చౌరస్తా, మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్ చౌరస్తాల్లో దాదాపు గంటల సేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి.