హైదరాబాద్

మళ్లీ నగరంపై వరుణుడి పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 12: నగరంపై వరణుడి మరోసారి పంజా విసిరాడు. బుధవారం ఒక్కరోజు తేలికపాటి వర్షంతో ఊపిరి పీల్చుకున్న నగరవాసి.. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో మరోసారి భయాందోళనకు గురయ్యారు. గత 14 రోజులుగా నగరంలో భారీ వర్షాలు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు నీరు చేరుకోవడంతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుండటంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. గురువారం ఉదయం నుంచి పొడిగానే ఉన్న వాతావరణం సాయంత్రం 5:30 ప్రాంతంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అతి తక్కువ సమయంలో భారీస్థాయిలో వర్షం నమోదు కావడంతో జంక్షన్లన్నీ జామ్ అయ్యాయి. పంజాగుట్ట ప్రధాన రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహించడంతో లక్డీకపూల్ వైపు నుంచి అమీర్‌పేట వైపుకు వెళ్లే మార్గంలో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. అమీర్‌పేట మైత్రీవనం జలదిగ్బంధంలో చిక్కుకుపోగా వందలాది వాహనాలు నీట మునిగిపోయాయి. అమీర్‌పేటలో ఓ వైపు మెట్రోపనులు, మరోవైపు భారీ వర్షంతో ఎస్సార్‌నగర్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపుకు వచ్చే వాహనాలు స్తంభించిపోయాయి. ఉద్యోగస్థులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడటంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ సమయం కావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్‌ఎంసి, ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రయత్నించారు.
గత కొంత కాలంగా ఎదురౌతున్న ఇబ్బందులను గుర్తించి అధికారులు ముందస్తు చర్యలను ప్రారంభించడంతో కొన్ని రూట్లలో ట్రాఫిక్ సాఫీగా సాగిపోయింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బిఎస్ మక్తా, బిఎస్ మక్తా, రాజీవ్‌నగర్, ఇంద్రానగర్, మారుతీనగర్, చింతల్‌బస్తీ, మార్కెట్‌బస్తీ, అమీర్‌పేట మార్కెట్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరుకోవడంతో ప్రజలు నానా తంటాలు పడ్డారు. నిత్యం ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుండటంతో దుర్ఘంధం వెదజల్లుతూ ఆనారోగ్యాల బారిన పడాల్సి వస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.