హైదరాబాద్

సామాజిక బాధ్యతే ఆన్‌లైన్ మీడియా విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 15: సామాజిక బాధ్యతతో ఆన్‌లైన్ మీడియా పనిచేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆన్‌లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ ఆన్‌లైన్ మీడియా - సామాజిక బాధ్యత’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి అతిధులుగా తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్, కూర్మనాధ్, శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ మీడియా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ అన్నారు. అదే సమయంలో భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగ పరచకుండా సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఐఅండ్‌పిఆర్ సమన్వయంతో ఆన్‌లైన్ మీడియా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాతో పోల్చితే ఆన్‌లైన్ మీడియాకు సామాజిక బాధ్యత ఎక్కువగానే ఉంటుందని సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛ ఉందని హద్దులు మీరితే ప్రభుత్వానికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాలను నియంత్రించాలని ప్రయత్నిస్తే అప్రజాస్వామికం అవుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మీడియాను, సోషల్ మీడియాను వేరుగా చూడలేమని, వేగం, నియంత్రణ లేకపోవడమే దీనికి కారణమని దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ మీడియా సామాజిక బాధ్యతతో నిజాయితీగా వార్తలు పెడితే గుర్తింపు వస్తుందని ప్రొఫెసర్ సత్తిరెడ్డి అన్నారు. ఆన్‌లైన్ మీడియాకు గుర్తింపు ఇవ్వడంతోపాటు వాటిని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాలని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, శ్రీ్ధర్ కోరారు. అసోసియేషన్ నాయకులు రాజగోపాల్, హనుమంతరావు, కార్యదర్శి శ్రీనివాస్, సదానందం, నర్సింహారావు, సంతోష్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.