హైదరాబాద్

సిటీపై వ్యాధుల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: భారీ వర్షం కురిసినపుడు కనీసం వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను నివారించటంలో జిహెచ్‌ఎంసి.. ఆ తర్వాత రోడ్లపై రోజుల తరబడి నీరు నిల్చుండటంతో ప్రబలే అంటు వ్యాధుల నివారణలో జిల్లా వైద్యారోగ్యశాఖలు దొందూ దొందుగానే తయారయ్యాయి. ఫలితంగా సిటీపై వ్యాధులు వార్ ప్రకటించాయి. ముఖ్యంగా గట్టిగావర్షం పడితే నాలాలు, డ్రేనేజీలు ఉద్దృతంగా ప్రవహించి, వర్షపు నీటిలో మురుగునీరు కలవటంతో దోమలు వృద్ధి చెందేందుకు ఎక్కువగా అవకాశాలుండటంతో క్రమంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికే నగరంలోని బోయిన్‌పల్లిలో ఒకరు, గాంధీ ఆసుపత్రిలో మరొకరు ఇప్పటికే డెంగీ వ్యాధి బారిన పడి మృతి చెందిన సంఘటనలు తెలిసిందే! దీనికి తోడు వాతావరణం బాగా చల్లబడటంతో స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో వందలాది మంది స్థానిక క్లీనిక్‌లలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మలేరియా అనుమానిత లక్షణాలున్న వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. పక్షం రోజుల క్రితం నగరంలో అతి భారీ వర్షం కురిసి నగరం అతలాకుతలమైన తర్వాత ముందు జాగ్రత్త అంటూ, ఒకటి రెండు చోట్ల జిల్లా యంత్రాంగం వైద్య శిబిరాలను నిర్వహించి చేతులు దులుపుకుంది. తరుచూ వర్షాలు కురిసినపుడు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండింతలు పెరుగుతున్నా, జిల్లా వైద్యారోగ్యశాఖ కనీస వ్యాధి నివారణ చర్యలు చేపట్టకపోవటం వల్లే డెంగీ, స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు మహానగర పాలక సంస్థ రౌండ్ ది క్లాక్ శ్రమిస్తున్నా, క్షేత్ర స్థాయిలో తలెత్తుతున్న కొన్ని కారణాల నేపథ్యంలో పారిశుద్ద్య పనులు సక్రమంగా సాగటం లేదు. ప్రజారోగ్య పరిరక్షణకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఇప్పటికైనా స్పందించి కనీసం లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాల్లోనైనా వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు ముందస్తుగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.