హైదరాబాద్

రోడ్ల మరమ్మతులపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: మహానగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, వాటి మరమ్మతులు, రీ కార్పెటింగ్ అంశాలపై కమిషనర్ జనార్దన్ రెడ్డి సోమవారం చీఫ్ ఇంజనీర్లతో ప్రత్యేక సమీక్షించారు. అతి భారీ వర్షాలు కురవటంతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు సకాలంలో మరమ్మతులు చేసి, వాహనదారుల ఇబ్బందులను నివారించాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో మొత్తం 9వేల 389 కిలోమీటర్ల మేరకు బిటి రోడున్నట్లు, వీటికి కాలానుగుణంగా నిర్వహణ చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో 20 శాతం అంటే 1878 కిలోమీటర్ల రోడ్డును ప్రతి సంవత్సరం రీ కార్పెటింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు గాను రూ. 488 కోట్ల వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర నిర్వహణ వ్యయాన్ని కలుపుకుని ఏటా రూ. 500 కోట్ల మేరకు వెచ్చిస్తున్నందున, తాజాగా 1878 కిలోమీటర్ల బిటి రోడ్డును రీ కార్పెటింగ్ చేయనున్నట్లు వివరించారు. ఇటీవల తరుచూ కురుస్తున్న వర్షాలకు రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇప్పటి వరకు నగరంలోని 1846 ప్రాంతాల్లోని దాదాపు 7.89చదరపు కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నట్లు గుర్తించామని అధికారులు సమీక్షలో కమిషనర్‌కు విరించారు. ఇందుకు గాను రూ. 77.77 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను టెండర్ల ప్రక్రియను కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేసి, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
గత సంవత్సరం కూడా కురిసిన అతి భారీ వర్షాలకు గాను 411 ప్రాంతాల్ల దెబ్బతిన్న రోడ్లను గుర్తించి రూ. 62 కోట్లతో మరమ్మతులు చేపట్టామని వివరించారు. గత జూలై, ఆగస్టు మాసాల్లో 148 ప్రాంతాల్లో రూ. 19కోట్ల 51 లక్షలతో మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. గత సంవత్సరం 218 ప్రాంతాల్లో భారీగా నీరు నిలుస్తున్నట్లు గుర్తించగా, ఈ సారి 346 వాటర్ స్టాగినేషన్ పాయింట్లను గుర్తించామని తెలిపారు. వీటికి రూ. 121 కోట్ల వ్యయంతో స్వల్ప, దీర్ఘ, మధ్యకాలిక ప్రాతిపదికన పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వీటికి టెండర్ల ప్రక్రియను వచ్చే వర్షాకాలానికి ముందే ఖరారు చేసి పనులు చేపడుతామన్నారు. వీటితో పాటు ఎప్పటికీ వర్షపు నీరు నిలిచి ఉండే మరో 13 పాయింట్లను గుర్తించామని, ఇక్కడి డ్రెయిన్లను ఆధునీకరించాల్సి ఉందని, ఇందుకు కేటాయించిన రూ. 61.67 కోట్లతో వచ్చే వర్షాకాలంలోపు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.