హైదరాబాద్

టౌన్ ప్లానింగ్‌లో ‘గోల్‌మాల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: మహానగర పాలక సంస్థకున్న ముఖ్యమైన ఆర్థిక వనరుల్లో టౌన్‌ప్లానింగ్ ఒకటి. ఈ విభాగంలో రోజురోజుకి పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎన్ని ఆన్‌లైన్, ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టినా, అవి ఫలించటం లేదు. ఎప్పటికపుడు వాటిని నిర్వీర్యం చేసి భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడటంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు సిద్దహస్తులయ్యారు. ఇందుకు ఉదాహరణనే సరూర్‌నగర్ సర్కిల్‌లో చనిపోయిన వ్యక్తి పేరిట, అడ్డదారిలో కమర్షియల్ సంస్థ నిర్మాణ అనుమతిని జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తే టౌన్‌ప్లానింగ్ అధికారులు తూతూమంత్రంగా క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించి, కళ్లు మూసుకుని నిర్మాణ అనుమతులిస్తున్న విషయం తేలిపోయింది. సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని 188 చదరపు గజాల స్థలంలో ఓ వైన్‌షాపుకు అవసరమైన నిర్మాణాన్ని చేపట్టేందుకు వీలుగా సంబంధీకులు ఈ నెల 7వ తేదీన జోనల్ టౌన్‌ప్లానింగ్ ఏసిపికి ఓ ఆర్కిటెక్చర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన ఛార్జీలు రూ. 69వేలను కూడా చెల్లించారు. అందులో ఖాళీ స్థలం పన్ను (వెకేట్ ల్యాండ్ ట్యాక్సు) కింద రూ. 39వేలను కూడా వసూలు చేసుకున్నారు. భూమి యజమాని యాదగిరి గౌడ్ 2014 మార్చి 3న చనిపోయినట్లు కూడా నిర్థారించుకోకుండా జిహెచ్‌ఎంసి అధికారులు హడావుడిగా అనుమతులు జారీ చేయటం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. భూమి యజమాని చనిపోతే అందుకు వారసులైన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుని, తాజాగా డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత, సదరు దరఖాస్తుకు అనుమతి కోసం జిహెచ్‌ఎంసి అధికారులు తదుపరి ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారటంతో కాసులకు కక్కుర్తిపడిన అధికారులు వెనకా ముందు ఆలోచించకుండా అనుమతులు జారీ చేశారు. అంటే ఎన్ని ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టినా, టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. అయితే దరఖాస్తుతాలుకూ క్షేత్ర స్థాయిలో ఓ మహిళా అధికారి తూతూమంత్రంగా పరిశీలన చేసి, అక్కడ పాతకాలపు గోడలున్నా, నివేదికలో లేనట్టు, అనుమతిచ్చేందుకు అన్ని రకాలుగా ఆమోదయోగ్యంగా ఉన్నట్లు తప్పుడు నివేదికను సమర్పించారు. దీంతో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన రోజునే ఆగమేఘాలపై నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఎట్టకేలకు ఈ విషయం వెలుగుచూడటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ అనుమతి జారీ చేసిన తేదీన మంజూరు చేసిన ఇతర అనుమతులను కూడా రద్దు చేస్తూ, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.