హైదరాబాద్

మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ హైవేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: మహానగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నగరంలో మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించరా. జిహెచ్‌ఎంసి ఇప్పటికే ప్రతిపాదించిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ‘న్యాక్’ ద్వారా ఔట్‌సోర్సు పద్దతిలో ఇటీవలే నియామకమైన 125 మంది ఇంజనీర్లతో మేయర్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, అలాగే నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన పనులను వేగవంతం చేసేందుకు యువ ఇంజనీర్లు మరింత ఉత్సాహాంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మెహిదీపట్నం నుంచి శంషాబాద్ మార్గంలో ఉన్న పివి నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే మాదిరిగానే మరో నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఉప్పల్ రింగురోడ్డు నుంచి వరంగల్ హైవే మార్గంలో ఒకటి, జూబ్లీబస్ స్టేషన్ నుంచి తూప్‌ఖానావైపు మరోకటి, ప్యారడైజ్ నుంచి సుచిత్ర జంక్షన్ వరకు, అలాగే బాలానగర్ నుంచి బాలానగర్ వై జంక్షన్ వరకు ఈ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మింనచున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు రూ. 20వేల కోట్ల రూపాయల వ్యయంతో వౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నామని వివరించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు లక్షా 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు సొంతిల్లు లేనట్లు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తేల్చినట్లు ఆయన తెలిపారు. నగరంలో రానున్న 50 ఏళ్ల వరకు మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు గనా నగర శివార్లు అయిన శామీర్‌పేటలో 25 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్, అలాగే రామోజీ ఫిల్మ్‌సిటీ మార్గంలో మరో రిజర్వాయర్‌ను నిర్మించనున్నట్లు మేయర్ తెలిపారు. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలను పోల్చితే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి రేటు అధికంగా ఉందన్నారు. విశ్వనగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పలు పథకాలను మరింత వేగవంతం చేసేందుకు, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఈ కొత్త సైటు ఇంజనీర్లు పనిచేయాలని మేయర్ హితవు పలికారు. టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగంలో సేవలు ఉపయోగించుకునేందుకు మరో 225 మంది సైటు ఇంజనీర్లను న్యాక్ ఆధ్వర్యంలో నియమించనున్నట్లు మేయర్ తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ సురేశ్, ఎస్‌ఈ అశ్విన్‌కుమార్‌లతో పాటు న్యాక్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.