హైదరాబాద్

నేడు కెటిఆర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్టమ్రున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
మధ్యాహ్నం పనె్నండుగంటల నుంచి సుమారు రెండు గంటల పాటు నగరంలోని సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సాగే ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటంతో పాటు మరో రెండు అభివద్ధి పనులను ప్రారంభించనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం పనె్నండు గంటల సమయంలో రాణిగంజ్ సమీపంలోని లాలా టెంపుల్ సమీపంలో సీవరేజీ పైప్‌లైన్ నిర్మాణం కోసం మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఒంటి గంట 15 నిమిషాలకు రాణిగంజ్ సమీపంలోని బోట్స్‌క్లబ్ రిజర్వాయర్ క్యాంపస్‌ను ఆ తర్వాత ఒకటిన్నర గంటల సమయంలో మా రెడ్‌పల్లిలోని రిజర్వాయర్ క్యాంపస్‌ను మంత్రి ప్రారంభించనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కెటిఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి

* జస్టిస్ చంద్రకుమార్
ఖైరతాబాద్, అక్టోబర్ 18: ధాన్యం కొనుగోలులో రైతులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు భద్రత చట్టాన్ని తీసుకురావాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సామాజిక ఉద్యమకారుడు చెన్నోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశానికి అన్నం పెడుతున్న రైతు బాధలు వినేవారు లేకపోవడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు. ఒక ఎకరం పంట పండించేందుకు రూ. 27,400 ఖర్చు వస్తుండగా, పండిన పంటను విక్రయించడం ద్వారా కేవలం రూ. 36,570 వస్తుందని దీంతో రైతులు ఆర్ధికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల జీవితాల్లో మార్పులు రావడం లేదని, కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. ఇంటిల్లిపాది శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు తంటాలు పడాల్సి వస్తుందని అన్నారు. మధ్య దళారులు కుమ్మకై అతి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ధాన్యం కొనుగోలు భద్రత చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పంట వేయక ముందే ఫలాన పంటకు ఇంత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ద్వారానే రైతాంగాన్ని రక్షించుకోగలుగుతామని అన్నారు. దీంతోపాటు గ్రామీణ చేతివృత్తుల ఉపాధి హామీ చట్టాన్ని సైతం తీసుకువచ్చి 150 రోజుల పనిదినాలను కల్పించాలని కోరారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలపై తాము పోరాటాలను కొనసాగిస్తామని రైతులను రక్షించలేని ప్రభుత్వాలు మరెంతో కాలం కొనసాగలేవని హెచ్చరించారు. చట్టసభల్లో రైతులకు 50 సీట్లు, సామాజిక కార్యకర్తలకు 25శాతం ఇతరులకు 25 శాతం సీట్లు కేటాయించి పీపుల్స్ అసెంబ్లీని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. రైతులకు రాజకీయ రిజర్వేషన్ల కల్పనతోపాటు రైతు సమస్యల పరిష్కారం కోసం అవసరమైన పార్లమెంట్‌ను ముట్టడిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రామ్‌కోటి, యాదగిరి, మధుసూదన్, రాజు, కృష్ణ, ముకేష్, కామేశ్వరరావు, శివాజీ పాల్గొన్నారు.