హైదరాబాద్

రైతు సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్‌లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు పంటలు వేసుకునే ముందు ఎకరానికి నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, అందులోభాగంగా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు దీటుగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తాగునీటితో పాటు సాగునీటి సరఫరాకు మిషన్ కాకతీయ పథకం ద్వారా సరిపడా నీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు తొమ్మిది గంటల పాటు కోతల్లేని విద్యుత్‌ను అందిస్తున్నట్లు, 24గంటలు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి రూ. 1590 ఏ గ్రేడ్, రూ. 1550 సాధారణ ధాన్యానికి యిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, స్థానిక సర్పంచ్ మూసి శంకర్, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, తహశీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి శ్రీవాణి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొంతం అంజిరెడ్డి, మండల సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, మాజీ చైర్మన్ డొంకెని భిక్షపతిగౌడ్, డైరెక్టర్లు బొక్కా ప్రభాకర్‌రెడ్డి, ఆకిటి నర్సింహా రెడ్డి, ఎంపిటిసి మంకం రవికుమార్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కందుల కుమార్, కీసరగుట్ట ఆలయ కమిటీ డైరక్టర్ తరిణె మహీంద్రాచారి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.