హైదరాబాద్

ఆదాయం తక్కువ..అంచనాలెక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: దేశంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదాయం తక్కువగా ఉంటుందని, అయినా కార్పొరేషన్ల ద్వారా అందే సౌకర్యాలు, సేవల పట్ల ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయని గ్రేటర్ కమిషనర్ డా.బి.జనార్ధన్‌రెడ్డి వివరించారు. మంగళవారం నగరానికి విచ్చేసిన పూణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి ప్రజలకు అందిస్తున్న సేవలను ఆయన వారికి వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏ పురపాలక సంస్థలోనైనా అన్ని విభాగాలు చక్కటి సమన్వయంతో పనిచేసినపుడే మెరుగైన సదుపాయాలు అందించే ఆస్కారమేర్పడుతుందని వివరించారు. పూణె నగరానికి, హైదరాబాద్ నగరానికి జీవన విధానానికి అనుకూలమైన వాతావరణం ఉండే సమీప్యత ఉందని తెలిపారు. పూణె నగరంలో సముదాయత మరుగుదొడ్ల నిర్వహణ ఆదర్శంగా ఉందని కమిషనర్ గుర్తుచేశారు.
సిటీ శానిటేషన్ భేష్
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుగా ఉన్నాయని పూణెకు చెందిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం జిహెచ్‌ఎంసిని అభినందించింది. నగరంలో తాము పలు ప్రాంతాలను పరిశీలించామని, దాదాపు కోటి జనాభా కల్గిన హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రశంసనీయంగా ఉందని వారు తెలిపారు. వీటితో పాటు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూ.5కే సబ్సిడీ ఆహార పథకం చాలా గొప్ప విషయమని, అంతేగాక, స్థానిక ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం స్కీం, మోడల్ మార్కెట్లు తదితర పథకాలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని పూణె బృందం ప్రశంసించింది.

‘పరిచయం’ భేష్!

హైదరాబాద్, డిసెంబర్ 1: జంటనగర ప్రజలకు అతి ముఖ్యమైన పౌరసేవలు, అత్యవసర సర్వీసులను అందించే మహానగర పాలక సంస్థ కార్యకలాపాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పరిచయం కార్యక్రమం క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలిస్తోంది. ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు పి.కె.మహంతి, వరంగల్ కలెక్టర్ వాకాటి కరుణలు అభినందించిన సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా ఈ ‘పరిచయం’ కార్యక్రమానికి కితాబునిచ్చినట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిహెచ్‌ఎంసి సిబ్బంది నిర్వర్తిస్తున్న విధుల పట్ల ప్రజల్లో, ప్రజల అవసరాలు, ప్రజలెదుర్కొంటున్న సమస్యల పట్ల సిబ్బందిలో పరస్పరం అవగాహన పెరుగుతోందని సిఎం అభిప్రాయపడినట్లు తెలిపారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన ఓ సమీక్షా సమావేశంలో కమిషనర్ ఈ విషయాన్ని వివరించారు. క్షేత్ర స్థాయి కార్మికులు, సిబ్బందితో ప్రజలకు సత్సంబంధాలు పెరిగి, పారిశుద్ధ్య పనులు సైతం మెరుగుపడుతాయని ఆయన అభిప్రాయపడినట్లు కమిషనర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది నేరుగా ప్రతి ఇంటికెళ్లి తమను తాము పరిచయం చేసుకుని, తాము చేసే పని వివరాలను వెల్లడించటంతో పాటు తమ సెల్ ఫోన్ నెంబర్లను సైతం అందించటంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఎంతో త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశముంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.