హైదరాబాద్

సీక్రెట్ పాకెట్‌లో బంగారు బిస్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,శంషాబాద్, అక్టోబర్ 21: బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు అనేకానేక పద్దతులు అవలంభిస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు దొరక్కుండా బంగారాన్ని ఎక్కడెక్కడో దాచుకొస్తూ పట్టుబడుతున్నారు. హైదరాబాద్, విశాఖ, చెన్నై లాంటి విమానాశ్రయాల్లో వారానికోసారి బంగా రం స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. వాళ్లు బంగారాన్ని దాచుకునే ప్రదేశాలను చూసి ఒక్కోసారి తనిఖీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
సరిగ్గా ఇలాంటి సంఘటన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఒకటి వెలుగులోకి వచ్చింది. అండర్‌వేర్‌కు జిప్ పెట్టి అందులో బంగారు బిస్కెట్లు పెట్టాడో ప్రబుద్ధుడు. గల్ఫ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణిడిపై తనిఖీ అధికారులకు అనుమానం రావడంతో ఈ విషయం బయటపడింది.
అండర్‌వేర్‌కు సీక్రెట్ పాకెట్ ఏర్పాటు చేసి అందులో బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 612.5 గ్రాముల బంగారం విలువ రూ. సుమారు 19 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.