హైదరాబాద్

మాజీ సర్పంచ్‌లకు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 22: గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మాజీ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ సర్పంచ్, ఎంపిటిసి, కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చంద్రకుమార్ హాజరై మాట్లాడారు. మాజీ పార్లమెంట్, శాసనసభ సభ్యులకు ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారో అదే తరహాలో మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాజకీయ రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు అవుతున్నా పేద వర్గాల వారిని అగ్రకులాల వారు తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని గౌరవ వేతనంతో విధులు నిర్వహించే సర్పంచులు మాజీలు అయిన తరువాత కుటుంబాన్ని సైతం పోషించలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరమని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ స్థానిక ప్రజాప్రతినిధులకు పెన్షన్లు అందించడంతో పాటు హెల్త్‌కార్డులు, రాయితీపై ప్రయాణించే సౌకర్యాలను కల్పించాలని కోరారు. నెలరోజుల్లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. అనంతరం ఫోరం నూతన కార్యవర్గాన్ని చంద్రకుమార్ ప్రకటించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా అచ్చన్నగౌడ్, అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షురాలు భానోతు మంగమ్మ నాయక్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి రాచర్ల సారయ్య, గౌరవ సలహాదారులు పద్మారావు పాల్గొన్నారు.